Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తోటి క్రికెటర్ చెల్లిని లైన్లో పెట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్, పెళ్లైనా కూడా

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి కొత్తగా చెప్సాల్సిన పనిలేదు. శిఖర్ ధావన్ క్రికెట్‌కు దూరం అయి రెండేళ్లకు పైగానే అవుతోంది. ఫామ్ కోల్పోవడంతో అతను జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో శిఖర్ ధావన్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌కు దూరం అయినప్పటికీ, ధావన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ధావన్ ప్రస్తుతం సోఫీ షైన్‌ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి తరచూ దర్శనం ఇస్తున్నారు.

సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్. ఆమె ధావన్‌తో కలిసి దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుండి వారిద్దరూ కలిసి పలుమార్లు కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఓ షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. ధావన్‌ డేటింగ్ చేస్తుంది సోఫీ షైన్‌తో కాదని మరో అమ్మాయితో అనే ప్రచారం జరుగుతుంది.

Dhawan relationship with Liam Livingstone sister of England cricketer Livingstone

ఇంగ్లాండ్ క్రికెటర్ లివింగ్‌స్టన్ సోదరి లియానా లివింగ్‌స్టన్‌తో ధావన్‌ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.ఇటీవల జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో తన ప్రేమ జీవితం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ధావన్ తాను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నానని పరోక్షంగా వెల్లడించాడు. అయితే, తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకుండా, "ఈ గదిలో ఉన్న అందమైన అమ్మాయేనా గర్ల్‌ఫ్రెండ్" అని చమత్కారంగా బదులిచ్చాడు. ఆ సమయంలో కెమెరాలు సోఫీ షైన్‌పై కేంద్రీకరించగా, ఆమె సిగ్గుపడుతూ కనిపించింది.

Dhawan relationship with Liam Livingstone sister of England cricketer Livingstone

అయితే ఈ ఇంటర్య్వూలో సోఫీ షైన్‌తో పాటు లియానా లివింగ్‌స్టన్‌ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో ధావన్ ప్రస్తుతం ఆమెతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ధావన్ గతంలో ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. లివింగ్‌స్టన్ కూడా అదే తరుఫున ఐపీఎల్ ఆడుతున్నాడు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి లివింగ్‌స్టన్ సోదరి లియానా లివింగ్‌స్టన్‌ ఇండియాకు వచ్చిందని , ఆ సమయంలోనే ధావన్‌,లియానా లివింగ్‌స్టన్‌ మధ్య పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనిపై ఎటువంటి క్లారిటీ లేనప్పటికి.. తాజాగా వీరు కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వారిద్దరి ప్రేమ నిజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Dhawan relationship with Liam Livingstone sister of England cricketer Livingstone

శిఖర్ ధావన్‌కు గతంలోనే పెళ్లైన సంగతి తెలిసిందే. భార్య అయేషా ముఖర్జీతో ధావన్ విడాకులు తీసుకున్నారు. ఢిల్లీలోని ఒక కుటుంబ న్యాయస్థానం 2023 అక్టోబర్‌లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయేషా ముఖర్జీ తన భర్తను మానసికంగా హింసించిందని పేర్కొంటూ ధావన్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధావన్ వైవాహిక జీవితం ఇలా విడాకులతో ముగిసింది.భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం ధావన్ లియానా లివింగ్‌స్టన్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఇక శిఖర్ ధావన్ కెరీర్ విషయానికి వస్తే..అతను ఒక దశాబ్దం పాటు భారత క్రికెట్ జట్టుకు గొప్ప వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.అతను 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్‌కు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచాడు.ICC టోర్నమెంట్లలో అతని బ్యాటింగ్ సగటు చాలా ఎక్కువగా ఉంది (65.15), కనీసం 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇది అత్యధికం.ధావన్ 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు మరియు 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు.అయితే ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+