టీమిండియాలో భారీ మార్పులు చేర్పులు?

Ravichandran Ashwin replacement: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 26వ తేదీన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బాక్సింగ్ డే టెస్ట్ ఇది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మరంగా కసరత్తు సాగిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్నాయి.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. 1-1తో సమంగా నిలిచాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ గెలవాలన్నా, డ్రాగా ముగించుకోవాలనుకున్నా బాక్సింగ్ డే గేమ్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో దీన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి రెండు జట్లు.

IND vs AUS Washington Sundar is likely to replace Nitish Kumar Reddy in the Boxing Day Test

ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కొనే జట్టును ఇప్పటికే ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఊహించినట్టే ట్రావిస్ హెడ్ జట్టుకు అందుబాటులోనే ఉన్నాడు. మూడో టెస్ట్ తరువాత గాయం కారణంగా అతను ఆడతాడా? లేడా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటిని పటాపంచలు చేస్తూ హెడ్‌ను తుదిజట్టులోకి తీసుకుంది.

ఉస్మాన్ ఖవాజా, కొత్త కుర్రాడు సామ్ కొన్‌స్టాస్, మార్నుస్ లాంబుషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్ (కేప్టెన్), మిఛెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్టాట్ బోలాండ్‌‌కు తుదిజట్టులో చోటు లభించింది. తొలి మూడు టెస్టుల్లో ఆడిన మెక్‌స్వీనీ జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో కొన్‌స్టాస్.. ఖవాజాతో ఇన్నింగ్‌ను ఆరంభించనున్నాడు. అతనికిదే తొలి టెస్ట్.

భారత జట్టులో కూడా భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మెల్‌బోర్న్ పిచ్.. స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం వల్ల ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్.. స్పిన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేస్తారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.. ఫాస్ట్ బౌలింగ్‌తో విరుచుకుపడొచ్చు. రోహిత్ శర్మ మరోసారి ఓపెనర్‌గా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మూడు టెస్టుల్లో అతను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడీ ఇన్నింగ్‌ను ఆరంభించాల్సి వస్తే- కేఎల్ రాహుల్.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సక్సెస్ అయినప్పటికీ కేప్టెన్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి రావొచ్చు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌తో బ్యాటింగ్ కూర్పు ఉంటుంది.

టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రాకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+