టీమిండియాకు అపశకునం- దెబ్బ మీద దెబ్బ: స్టార్ ప్లేయర్ కు వైరల్ ఫీవర్.. !!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మహాసంగ్రామం నేడు ప్రారంభం కాబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్త దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. మొత్తం 20 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆడనున్నాయి., ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం పోటీ పడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ దఫా కూడా టైటిల్ హాట్ ఫేవరెట్. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో భారత్ ఎదుర్కొన్న వివాదాలు.. ఆఫ్ ఫీల్డ్ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఉత్కంఠభరితంగా మారింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. అతను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. దీంతో వాంఖడేలో జరిగే ఈ పోరుకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. తొందరపడి అతన్ని ఆడించాలని అనుకోవట్లేదు. ఓ చిన్న జట్టుతో మ్యాచ్ కావడం, తాత్కాలిక ఉపశమన చర్యలతో బుమ్రాను ఆడించితే మొదటికే మోసం వస్తుందని భావిస్తోంది.

బుమ్రా దూరం కావడంతో భారత్‌కు ప్రస్తుతం 13 మంది ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంకా జట్టులో చేరలేదు. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. తుది ఫిట్‌నెస్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు బుమ్రా నెట్ ప్రాక్టీస్ కు కూడా రాలేదు. దీంతో అతను గైర్హాజర్ కావడం ఖాయమైంది. బుమ్రా స్థానంలో తుది జట్టులో మహ్మద్ సిరాజ్‌కు చోటు లభించవచ్చు.
నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయంతో హర్షిత్ రాణా టోర్నమెంట్ నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో అతని స్థానంలో జట్టులో చేరాడు సిరాజ్. బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడి ఇన్నింగ్ ను ఆరంభించనుంది.
ఈ టోర్నమెంట్ మొత్తం మీద వీరిద్దరే ఓపెనింగ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో ఇషాన్ ఓపెనర్‌గా 53 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌పై తిరువనంతపురంలో సెంచరీ బాదాడు. సంజు శాంసన్ ఫామ్ కోల్పోవడంతో, టీమిండియా కిషన్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది.
నేటి మ్యాచ్ లో ఆడే తుదిజట్టులో- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కేప్టెన్), శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి ఆడే అవకాశం ఉంది.
-
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications