అభిషేక్ శర్మపై సన్‌రైజర్స్ ఆగ్రహం.. నమ్మించి మోసం చేస్తావా అంటూ ఫైర్
శనివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఉప్పల్‌లో ఈ రెండు జట్లు కూడా పరుగుల వరద పారించాయి. వరుస ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను నిరాశ పరించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లో ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో సన్‌రైజర్స్ అదరగొట్టింది. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత పోరాట పటిమను చూపించింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం కనిపిస్తున్నప్పటికీ, ఏమాత్రం బెదరకుండా సులువుగా లక్ష్యాన్ని ఛేదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సత్తా ఎలాంటిదో మరోసారి ఐపీఎల్‌కు రుచి చూపించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది మరియు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. షేయస్ అయ్యర్ (82), మార్కస్ స్టోయినిస్ (34*) మరియు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (42) పంజాబ్ బ్యాటింగ్‌లో ముఖ్యమైన పరుగులు చేశారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ట్రావిస్ హెడ్ కూడా 37 బంతుల్లో 66 పరుగులు చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్ ఆటగాడిగా రికార్డు నెలకోల్పాడు. మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అదరగొట్టారు. ముఖ్యంగా తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.క్రీజ్‌లోకి వచ్చిన దగ్గర నుంచే పంజాబ్ బౌలర్లకు తన విశ్వరూపం చూపించాడు.స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ అనంతరం అభిషేక్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. అభిషేక్ శర్మ తన జేబులో ముందుగానే ఓ పేపర్ పెట్టుకుని వచ్చాడు.
ఆ పేపర్‌పై 'This one is for Orange army(ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం)'అని రాసి ఉంది. దీంతో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని ముందే చెప్పాడని , దానికి అనుగుణంగానే ఈ పేపర్ తన జేబులో పెట్టుకున్నాడని అంతా భావించారు. చెప్పి మరీ సెంచరీ కొట్టాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అసలు విషయాన్ని బయటపెట్టాడు సన్‌రైజర్స్ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్. మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ..అభిషేక్ శర్మ ఆ పేపర్‌ను గత ఆరు మ్యాచ్‌ల నుంచి తన జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నాడంటూ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాణించాడు కాబట్టి తాను రాసుకున్న పేపర్‌ను బయటపెట్టాడంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇంత నమ్మించి మోసం చేస్తావా అంటూ సరదాగా అభిషేక్ శర్మపై కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications