వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవదాసు - ఒక పిచ్చివాడి ప్రేమకథ

By Staff
|
Google Oneindia TeluguNews


నెలలు నిండిన మేఘమొకటి
ఆకులురాల్చిన చెట్టు మీద ఒరిగి
గుసగుసలాడింది...
నాలుగు చినుకులౌతాను
ఒక పువ్వు నిస్తావా అని....

ఆవిరవుతున్న సెలయేరు
తీరం మీది అలల నడిగింది
తేమనయి వికసిస్తాను
చల్లదనమై పరుచుకుంటావా అని

చెక్కిలి మీద రాలిన కన్నీటి పువ్వు
ఒణుకుతున్న పెదవినడిగింది
గుండె బరువు దించానిక
చిరునవ్వయి పరిమళిస్తావా అని...

నీ జ్ఞాపకంలో మైమరిచి పోతాను
నీ స్పర్శలో రద్దయిపోతాను
అపురూప అద్వైత స్నేహ ప్రతీకవవుతావా
అని ఒక ప్రియుడు నెచ్చెలినడిగాడు
- ఎన్‌. వేణుగోపాల్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X