వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ఇంటి కంటే సోనియా 10జన్‌పథ్ పెద్దది

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం ప్రధాని నరేంద్ర మోడీ నివాసం కంటే ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. 7 రేస్ కోర్సులోని ప్రధాని మోడీ నివాసం కంటే సోనియా 10 జన్‌పథ్ ఎంతో పెద్దది అని తేలింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీల ఇళ్లు మాత్రమే 10 జన్‌పథ్ కంటే పెద్దవిగా ఉంటాయి. ప్రధాని సహా అందరికీ వాళ్ల పదవులను బట్టి అధికారిక నివాసాలుగా మాత్రమే ఆయా భవనాలను కేటాయించగా, సోనియాకు మాత్రం పార్లమెంటు సభ్యురాలి హోదాతో సంబంధం లేకుండా జన్‌పథ్ కేటాయించారు.

సోనియా గాంధీ నివాసం 15,181 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రధాని మోడీ నివాసం మాత్రం 14,101 చదరపు మీటర్లు మాత్రమే ఉంది. రాష్ట్రపతి భవన్ మాత్రం అన్నింటి కంటే పెద్దగా 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలో మరే దేశాధినేతల నివాసం చూసినా దీని కంటే తక్కువే ఉంటాయట.

10 Janpath bigger than PM’s 7 RCR, reveals RTI

6 మౌలానా ఆజాద్ రోడ్డులోని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాసం 26,333 చదరపు మీటర్లు ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్లో ఉంటున్నారు. ఆయన భవనం విస్తీర్ణం 5,022 చదరపు మీటర్లు. ప్రియాంక గాంధీ ఉండే 35 లోదీ ఎస్టేట్ బంగాల్ విస్తీర్ణం 2,765 చదరపు మీటర్లు.

ఆసక్తికర విషయమేమంటే.. ప్రియాంక గాంధీకి సంబంధించిన విషయం సరికాదని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారు. సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎలాంటి సమస్య రాలేదని, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల అని చెబుతూ ప్రియాంక గాంధీ రెసిడెన్షియల్ విషయాలు చెప్పడం లేదని భట్టాచార్య అన్నారు.

English summary
Congress president Sonia Gandhi has one of the largest residences among politicians in the country, bigger than even the Prime Minister's official abode at 7 Race Course Road in size.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X