లొంగుబాటుకుమొద్దు శ్రీను ముహూర్తం

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుపరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాననిందితుడు జూలకంటి శ్రీనివాస్‌ రెడ్డి అలియాస్‌మొద్దు శ్రీను వచ్చే ఆదివారంలొంగిపోతానని అంటున్నాడు. అయితే ఈలోగాపరిటాల రవి అనుచరులిద్దరినీచంపుతానని చెబుతున్నాడు. ఇదంతా ఒకతెలుగు ప్రైవేట్‌ తెలుగు టీవీ ఛానల్‌తోఅతను టెలిఫోన్‌లో మాట్లాడినకథనం ప్రకారమే.

ఆప్రైవేట్‌ టీవీ ఛానల్‌తో జూలకంటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడాడు. ఆదివారం కూడాఇదే టీవీ చానల్‌ ప్రతినిధితోమాట్లాడుతుండగా పిట్‌పిట్‌ బాషాఅలియాస్‌ బంగారు బాషాను పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. హంతకులకుపిట్‌పిట్‌ బాషా డబ్బులు సమకూర్చాడనేఆరోపణలున్నాయి. మొద్దు శ్రీనును పోలీసులుఅరెస్టు చేశారంటూ సోమవారం ఉదయంవెలువడిన ఒక ప్రముఖ తెలుగుదినపత్రిక ప్రచురించింది. అయితే తాముఅరెస్టు చేయలేదని, మొద్దు శ్రీనునుఅరెస్టు చేయడంలో తామువిఫలమయ్యామని హైదరాబాద్‌నగర పోలీసు కమీషనర్‌ దినేష్‌రెడ్డి చెప్పినట్లు మరో ప్రైవేట్‌తెలుగు టీవీ చానల్‌ ప్రసారంచేసింది.

జూలకంటిశ్రీనివాస్‌ రెడ్డి ఒక తెలుగు టీవీ ఛానల్‌కుచిక్కి చాలాసేపే మాట్లాడాడు. పరిటాల రవినిహత్య చేసినందుకు తానుగర్విస్తున్నానని అతను అన్నాడు. డబ్బులకోసం పరిటాల రవిని హత్య చేయలేదని,సూరితో ఉన్న స్నేహంతోనే అందుకుసిద్ధపడ్డామని అతనుప్రకటించుకున్నాడు. సూరి కుటుంబసభ్యులను చంపినందుకే పరిటాలనుహత్య చేశానని అతను చెప్పుకున్నాడు.సూరిని పందొమ్మిది వందల తొంబై యేడలోహైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ జైలులో,రెండు వేల మూడులో చర్లపల్లి జైలులోకలిశానని శ్రీను అంటున్నాడు. పిట్‌పిట్‌ బాషాఎవరో తనకు తెలియదని అతనుచెప్పాడు. పరిటాల హత్యతో ముఖ్యమంత్రికుమారుడు వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డికి, మంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఐజిమీనాకు ఏ విధమైన సంబంధం లేదనిఅతను చెప్పాడు.

మీడియాప్రతినిధులకు చిక్కుతున్నవారు ఒకరాష్ట్ర పోలీసు యంత్రాంగానికి చిక్కరాఅనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+