వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ దిగివచ్చిన వైనం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 15-07-2005

YSRహైదరాబాద్‌:కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకుపుడతాడన్నట్టు ఉంది టిఆర్‌ఎస్‌ నాయకులజాతకం. ముఖ్యమంత్రి వైఎస్‌తో సమావేశం ఏర్పాటుచేయిస్తానని కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చినప్పటికీ,వైఎస్‌ మొండితనం తెలిసినవారెవరూ అది సాకారమవుతుందనుకోలేదు.చంద్రశేఖరరావుతో సమావేశానికి కొన్ని రోజులక్రితం వైఎస్‌ ఎటువంటి ప్రాధాన్యంఇవ్వలేదు. ఎనిమిది కోట్ల మందిరాష్ట్ర ప్రజల్లో ఎవరైనా తననుకలవవచ్చని వ్యాఖ్యానించారు. వైఎస్‌తోసమావేశం జరుగుతుందని కానీ, ఆసమావేశం ఫలప్రదమవుతుందనికానీ టిఆర్‌ఎస్‌ నాయకులు అనుకోలేదు.

ఈలోపు ఒకపరిణామం జరిగి అది వైఎస్‌ తలబిరుసుతనాన్ని తగ్గించింది. అదే ఓక్స్‌వ్యాగన్‌ కుంభకోణం. రాష్ట్రప్రభుత్వం ఊరూపేరూ లేని ఒక బినామీసంస్ధకు 11 కోట్లు చెల్లించడంతో వైఎస్‌ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. దీనిమీదకాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఆగ్రహం చెందినట్టుకన్పిస్తోంది. ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ కూడా దీనిపైఇంటిలిజెన్స్‌ బ్యూరో దర్యాప్తుకుఆదేశించారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖరరావుతోసమావేశాన్ని ఏదోవంకతో రద్దు చేసుకోవాలనుకున్నవైఎస్‌ మారిన పరిస్ధితుల నేపధ్యంలోఅధిష్టానవర్గానికి తలొగ్గకతప్పలేదు. చంద్రశేఖరరావుతోఈనెల 20న ఢిల్లీలో సమావేశంకావడానికి వైఎస్‌ తప్పనిసరిపరిస్ధితుల్లో ఒప్పుకున్నారు.

అధిష్టానవర్గంవైఎస్‌ తీసుకున్న ముఖ్య నిర్ణయాలను సమీక్షించే అవకాశముంది.ఇప్పటివరకు ఆయనకు పూర్తి స్వేచ్ఛఇచ్చిన అధిష్టానవర్గం ఇక మీదట గట్టిగావ్యవహరిస్తుంది. వైఎస్‌ ఏకపక్షంగావ్యవహరిస్తున్నారన్న ఆరోపణలుఇప్పటికే సోనియా గాంధీ దృష్టికి వచ్చాయి. వోక్స్‌ వ్యాగన్‌కుంభకోణంఅంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్‌లో యావత్‌దేశం పరువును తీసిందనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ఒక్కరే వైఎస్‌కు ఇప్పటికీఅండగా ఉన్నారు. వైఎస్‌ ప్రతి చర్యనూసమర్ధిస్తున్నారు. అందుకు కారణాలువేరే ఉన్నాయి. ఇలా ఉండగా వోక్స్‌ వ్యాగన్‌ఉదంతంపై రాజశేఖరరెడ్డి తొమ్మిది పేజీలలేఖను సోనియా గాంధీకి రాశారు.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనేవ్యోక్స్‌వ్యాగన్‌తో వ్యవహారం నడిపామని ఆయనసమర్ధించుకున్నట్టు తెలిసింది.అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలతర్వాత వైఎస్‌ తొలిసారిగా డిఫెన్స్‌లోపడ్డారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X