వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపీ 'కింగ్' కి అర్హత?

By Staff
|
Google Oneindia TeluguNews

Srinu Vytla
'కింగ్' సినిమా ద్వారా శ్రీను వైట్ల ..డైరక్ట్ గా సంగీత దర్శకుడు చక్రిని పోలిన బ్రహ్మానందం పాత్రని పెట్టి సెటైర్స్ వేసాడు. చక్రి హాలీవుడ్ నుండి,బాలీవుడ్ నుంచి పాప్ సంగీతం నుండి ట్యూన్స్ ఎత్తుకొస్తాడని ఘాటుగా విమర్శించాడు. అయితే శ్రీను వైట్ల చేసే సినిమాలన్నీ ఒరిజనల్ గా ఆయన(లేదా ఆయన రచయితలు)బుర్రలు నుండి పుట్టిన వైతే ఎదుటి వారి వైపు వేలు పెట్టి చూపెడితే బాగుండేది. ఎందుకంటే కింగ్ సినిమా సరిగ్గా పరిశీలించిన వారికి వెలకమ్ స్టోరీ లైన్,రేస్ ట్విస్టు తో ముడి పెట్టి,ఇ.ఎమ్.ఐ సినిమాలోని కామిడీ సన్నివేశాలను ఎత్తివేసారని ఇట్టే అర్ధమవుతుంది. అంతేగాక ఓం శాంతి ఓం తరహా పాట కూడా పెట్టి నేను బాలీవుడ్ ని అనుకరిస్తాను అని బహిరంగంగా ప్రకటించుకున్నట్లు చేసాడు.

శ్రీను గతంలోనూ దూబాయ్ శ్రీను సినిమాలో చిరంజీవిని (తనతో అందరివాడు చేసిన)సెటైర్ చేస్తూ ఎమ్.ఎస్.నారాయణ పాత్ర రూపొందించాడు.రెడీలో దుబాయి శీను నిర్మాత దానయ్య పేరు పెట్టి సెటైర్ చేసాడు. ఇప్పుడు జయసూర్య పేరుతో ఢీ సమయంలో తనని ఇబ్బంది పెట్టిన చక్రిని సెటైర్ చేసాడు.కాపీ కొట్టడం కొత్తా కాదు..పరిశ్రమ దృష్టిలో తప్పూ కాదు. (తప్పు అని ఫీలయితే ఇన్ని కళా ఖండాలు మన మీదకు దూకేవి కావు).అసలు శ్రీను వైట్ల కెరీర్ లో మొదటి రోజుల్లో వచ్చిన పెద్ద హిట్టు గా చెప్పబడే వెంకీ చిత్రం ఓ మళయాళ చిత్రమని అందరకీ తెలుసు. మోహన్ లాల్,ముమ్మట్టి నటించిన ఈ చిత్రం నెంబర్ ట్వంటి మద్రాస్ మెయిల్ పేరుతో డబ్బింగ్ అయి ఇక్కడ కూడా రిలీజైంది. అయితే అందులో రైల్లో జరిగే కామిడీ మాత్రం ప్యూర్ గా శ్రీనుదే కావటం గొప్పతనానికి కారణం అయింది. ఇలా చాలా సార్లు చాలా సీన్స్ మొహమాటం లేకుండా ఎత్తేసే శ్రీను అలా ఓ పేరున్న సంగీత దర్శకుడు మీద సెటైర్ వేయిటం గురువింద గింజ సామెత లాంటిదని పరిశ్రమ టాక్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X