• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్యం రాజు కొడుకు మెడకు ఉచ్చు!

By Staff
|

Teja Raju
హైదరాబాద్: సత్యం రామలింగరాజుతో పాటు ఆయన కుమారుడు తేజారాజుపైనా కేసుల పరంపర కొనసాగుతుంది. తాజాగా తేజారాజు ఏర్పాటు చేసిన మేటాస్‌ హిల్‌ కౌంటీపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మైటాస్‌ హిల్‌ కౌంటీ పేరుతో ఇళ్ల నిర్మాణాం చేస్తానని చేప్పి మోసం చేశారని.. రమణయ్య, అంకమ్మలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణా జరిపిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయలను తీసుకున్న తరువాత కూడా..సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయలేదన్నది బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో..సెక్షన్‌ 420, 406ల సెక్షన్‌ క్రింద తేజరాజుపై కేసులు బుక్‌ చేసిన పోలీసులు..అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేజిక్కించుకోడానికి మేటాస్ చివరి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మేటాస్ హిల్ కౌంటీ వివాదం రామలింగరాజు కుమారుడి మెడకు చుట్టుకుంది. ఇప్పటికే రామలింగరాజు నాలుగైదు నెలలుగా చంచల్ గుడా జైలులో నిర్భంధంలో ఉంటున్నారు. ఆయన తమ్ముడు రామరాజు కూడా అదే జైలులో ఉన్నారు. ఇప్పుడు తేజరాజు కూడా జైలుకి వెళితే ఆ కుటుంబ వ్యాపారాలను నడిపే వారే కరువవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X