హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షిలో 'కాలచక్రం'

By Staff
|
Google Oneindia TeluguNews

Nookala Suryanarayana
హైదరాబాద్: "సాక్షి" టీవీలో ఈ మధ్య ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రసారమౌతోంది. "కాల చక్రం" అనే ఆ కార్యక్రమాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు నూకల సూర్యనారాయణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు మంచి ఆత్మ విశ్వాసం కలుగుతున్నట్టు రిపోర్టులను బట్టి తెలుస్తోంది. వేద పరిభాషతో, సంస్కృత శ్లోకాల క్రోడీకరణతో నూకల వారు చెబుతున్న గ్రహగతులు, వాటి ప్రభావాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాక్షి టీవీ చానల్ కు ఆధునిక టెక్నాలజీ ఉన్నందువల్ల ఒబి వ్యాన్ల ద్వారా, ఫోన్ల ద్వారా, ఇమెయిల్స్ ద్వారా అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తుంటారు. ఆయనది ధీర గంభీర స్వరం. పైగా తరతరాల నుంచి వచ్చిన జ్యోతిష అనుభవం. అంకెల లెక్కలు తప్పవచ్చేమో కానీ గ్రహగతుల లెక్కలు ఆ శాస్త్రం ప్రకారం తప్పవు. ఈ కార్యక్రమం ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు సాక్షి టీవీలో ప్రసారమవుతోంది.

నూకల సూర్యనారాయణ టెక్నాలజీ అండ్ ట్రేడిషన్ ను కలిపి ప్రజలకు చక్కటి సలహాలు ఇస్తున్నారు. బిగ్ ఎఫ్ ఎం ద్వారా మొదటిసారిగా రేడియో జ్యోతిషాన్ని ప్రారంభించింది ఆయనే. ఆ తర్వాత అన్ని ఎఫ్ ఎం రేడియోలు లైవ్ జ్యోతిషం ఇవ్వడం ప్రారంభించాయి. టీవీ 5 లో గ్రహశాస్త్రం కార్యక్రమాని ప్రారంభించిది ఆయనే. ఆప్పటి వరకు టీవీలలో జ్యోతిషమ్ లో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నామమాత్రంగా ఉండేవి.

బిగ్ ఎఫ్ ఎంలో ట్వంటీ-20 మొదటి క్రికెట్ మ్యాచ్ (పాకిస్ధాన్-ఇండీయా)లో ఇండియా విజయం సాధిస్తుందని 8 గంటలముందే బిగ్ ఎఫ్ ఎం రేడియో ద్వారా ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తీరా ఆ మ్యాచ్ చూస్తుంటే ఇం డియా ఓడిపోయేటట్టు కన్పించింది. చివర్లో శ్రీశాంత్ అద్భుత క్యాచ్ తో ఇండియా విజయం సాధించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్య విజయానికి ముందు ఆయన "సాక్ష్" చానల్ లో చేరి, ఆ పార్టీ విజయం కోసం గణపతి హోమం నిర్వహించినట్టు ఆయన అభిమానులు ఈ పోర్టల్ కు తెలియజేశారు. నాలుగేళ్ళ క్రితం ఇదే దట్స్ తెలుగు డాట్ కాం ద్వారా ఆయన కొన్ని వేల మంది ఈ మెయిల్స్ కు వ్యక్తిగతంగా జవాబులిచ్చి వారి భవిష్యత్తు గురించి చెప్పారు. ఆ కార్యక్రమం పెద్దగా విజయవంతమైన విషయం మా పాఠకులకు తెలుసు.

సాక్షి టీవీని సమర్ధంగా నిర్వహిస్తున్న ప్రియదర్శిని రామ్ ఈయన ప్రతిభను తెలుసుకుని సాక్షిలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. నూకల సూర్యనారాయణను ఈ నెంబర్లలో మీరు సంప్రదించవచ్చు. 9949579697, 040-23812678. లేదా మెయిల్ లో [email protected] సంప్రదించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X