జగన్ కు మరో షాక్!

"రాష్ట్రం నుంచి సమాచారం ఎప్పటికప్పుడు సోనియాకు చేరుతోంది. బహుశా ఈ కథనం కూడా మేడమ్ దృష్టికి వచ్చి ఉండవచ్చు. అందువల్లే ఆమె జగన్‌తో భేటీని తిరస్కరించి ఉంటారు. జగన్‌కు ఏ స్థాయిలోనూ ప్రాధాన్యం లభించడం ఇష్టంలేని కొన్ని శక్తులు కూడా అధిష్ఠానం మనసు మార్చి ఉండవచ్చు" అని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వైఎస్ మరణానంతరం జగన్ వర్గం చేసిన హడావుడి నచ్చకే సోనియా వారిని ఇన్నాళ్లూ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. సోనియా మొదటినుంచీ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేరీతిలో వ్యవహరించేవారికి ప్రాధాన్యం ఇవ్వకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత నిర్ణయానికీ అదే కారణమయ్యే అవకాశాలున్నాయి.
సోనియా అపాయింట్ మెంట్ రద్దు అయినా జగన్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. తండ్రి వైయస్ మరణించిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎంపీగా ఒక స్ధాయీ సంఘం సమావేశంలో పాల్గొనడానికి ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది. సోనియా అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించిన కెవిపి రామచంద్రరావుకు కూడా నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా కెవిపి రామచంద్రరావు హైకమాండ్ ఆదేశం మేరకు రోశయ్యకు సన్నిహితంగా మారారన్న అనుమానం జగన్ వర్గీయుల్లో ఉంది.












Click it and Unblock the Notifications