హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యకు షాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన బావమరిది, సినీ నటుడు బాలకృష్ణకు షాక్ ఇవ్వబోతున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను బాలకృష్ణకు అప్పగించాలనే డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచి చాలా కాలంగా వస్తోంది. అయితే దాన్ని చంద్రబాబు మొదటి నుంచి కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇటీవలి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో పార్టీ కోసం బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మొదటికే మోసం చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం. దసరా లోగా ఆయన పార్టీ కమిటీలను, పోలిట్ బ్యూరోను పునర్వ్యస్థీకరించబోతున్నారు. బాలకృష్ణకు పోలిట్ బ్యూరోలో అవకాశం కల్పించే అవకాశాలున్నట్లు భావించారు. అయితే బాలకృష్ణను పోలిట్ బ్యూరోలోకి తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి తోడు, హరికృష్ణను పోలిట్ బ్యూరో నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో కూడా హరికృష్ణ చురుగ్గా పనిచేయలేదు. ఆయన చంద్రబాబుతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. తమ సోదరి, కేంద్ర మంత్రి పురంధేశ్వరి పట్ల అనుసరిస్తున్న వైఖరి హరికృష్ణకు కోపం తెప్పించినట్లు భావిస్తున్నారు. అందుకే పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆయనను కూడా దూరంగా పెట్టాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు వచ్చినప్పుడు వారి సేవలను వినియోగించుకోవడం తప్ప పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వకూడదనేది చంద్రబాబు అభిమతమని అంటున్నారు. పార్టీలో స్వర్గీయ ఎన్టీఆర్ వారసులకు క్రియాశీలక పాత్ర ఇస్తే తనకు ప్రమాదమని చంద్రబాబు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్ల ఆయన ఎన్టీఆర్ వారసులను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని భావిస్తున్నారని సమాచారం. ఇటీవల వారసత్వ రాజకీయాలకు దూరమని చేసిన ప్రకటన లోకేష్ నో, జగన్ నో ఉద్దేశించి చేసింది కాదని, బాలయ్యను పార్టీ కమిటీలోకి తీసుకునే ఉద్దేశంలేకనే ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇదిలా వుంటే, పార్టీ పోలిట్ బ్యూరోలోకి టి. దేవేందర్ గౌడ్ ను, తలసాని శ్రీనివాస యాదవ్ ను తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దేవేందర్ గౌడ్ విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డి తనకు పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలని కోరుతూ దేవేందర్ గౌడ్ కు స్థానం కల్పించకూడదని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చినవారికి, పార్టీపై ఇంతకు ముందు విమర్శలు చేసేవారికి పార్టీ కమిటీల్లో స్థానం కల్పించవద్దని ఆయన చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ కు చెక్ పెట్టడానికే హరీశ్వర్ రెడ్డి ఈ డిమాండ్ పెడుతున్నట్లు సమాచారం. ఏమైనా పార్టీ కమిటీల కసరత్తు చంద్రబాబుకు అంత సులభమైన పనేం కాదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X