హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి నిస్తేజం!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చాలా అందంగా, హ్యాండ్సమ్ గా ఉన్నారని ఎవరో అంటే ఆ అభిప్రాయంతో చిరంజీవి ఏకీభవించారు. నిజానికి హీరో చిరంజీవి మనోహర్ కంటే అందంగా ఉండాలి. కానీ ఎన్నికల ప్రచారంలో ఎండల్లో తిరిగి ఆయన నల్లబడిపోయారు. సినిమాల్లో ఉన్నప్పటిలా వ్యాయామం చేయడం లేదు. దానితో బాగా లావెక్కిపోయారు. అసెంబ్లీలో తోటి మహిళా ఎమ్మెల్యేలు కూడా ఆయనను చూసి అదో రకంగా మొహం పెడుతున్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన అపాయింట్ మెంట్ కోసం వేచి చూసిన రాజకీయ నాయకులకు ఇప్పుడు ఆయన రెడీమేడ్ గా కన్పించేసరికి భలే మంచి చౌక బేరంగా కన్పిస్తోంది.

చిరంజీవి తన ఆరోగ్యంపై, ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించడం లేదన్నది వాస్తవం. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో ఆయన మొహం కళా విహీనంగా కన్పిస్తోంది. సినిమాల్లో ఎటూ నటించే అవకాశం లేనందున ఆయనలో సౌందర్య స్పృహ లోపించింది. హార్డ్ కోర్ రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన రఫ్ అండ్ టఫ్ గా ఉండాలనుకుంటున్నట్టు కన్పిస్తోంది.

ఇక పార్టీ ప్రజారాజ్యం నుంచి వలసలు చిరంజీవిని బాగా కుంగదీస్తున్నాయి. తాజాగా తమ్మినేని సీతారామ్ టిడిపిలోకి వెళ్తున్నారు. ఇక ప్రజారాజ్యంలో మిగిలింది చిరంజీవి కాకుండా ఆ పదిహేడు మంది ఎమ్మెల్యేలే.ఓడిపోయినవారు, పోటీ చేయనివారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చిరంజీవికి సవాలు కాబోతున్నాయి. ఆయన పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అందువల్ల ఆయన విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. దీనితో ఆయన గ్లామర్ మరింత తగ్గే అవకాశముంది. చిరంజీవి గ్లామర్ తగ్గిపోవడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X