హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి రాజకీయాలు మొహం మొత్తాయా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవికి రాజకీయాలంటే మొహం మొత్తిందా? తాజా వ్యవహారాలను బట్టి అలాగే అనుకోవలసి వస్తోంది. తాను మళ్ళీ నటించాలని చాలా మంది కోరుకుంటున్నారని, సమాజం బాగు కోరే మంచి పాత్ర లభిస్తే మళ్ళీ నటిస్తానేమోనని ఆయన టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు యత్నాలు బెడిసికొట్టడంతో ఆయనలో రాజకీయ వైరాగ్యం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. మహా సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కంటే విలీనమే సుఖప్రదమని ఆయన, ఆయన శ్రేయోభిలాషులు ఆలోచిస్తున్నట్టు తాజా సమాచారం.

చిరంజీవికి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశముందని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రజారాజ్యానికి ఆశించినన్ని స్ధానాలు రాకపోవడంతో చిరంజీవి షాక్ తిన్నా, ఆయన ఈ నాలుగైదు నెలలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాజకీయ నాయకుడిగా కొత్త పాత్ర పోషణలో కొంత కాలం ఆనందం అనుభవించారు. ఇప్పుడు ఆ పాత్ర ఆయనకు బోర్ గా అనిపిస్తున్నట్టుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యాభై స్ధానాలకు పోటీ చేయడం ఆ మేకపోతు గాంభీర్యంలో భాగమే. గ్రేటర్ లో కనీసం ఇరవై స్ధానాలు వచ్చినా కాంగ్రెస్ లో విలీనానికి ముందు మంచి డిమాండింగ్ పవర్ ఉంటుందని చిరు వర్గీయుల ఆలోచన.

సొంతంగా పార్టీని నడపడం ఎంత కష్టమో, రాజకీయాల్లో అవకాశవాదం ఎంత దారుణంగా ఉంటుందో చిరంజీవి స్వయంగా చూశారు. తన అభిమానులు, తన కులం వారు గట్టిగా నిలబడితే తాను ముఖ్యమంత్రినై పోవడం చాలా సులభమని ఆయన కట్టుకున్న గాలి మేడలు కూలిపోయాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 25 శాతం ఉన్న కాపు, దాని అనుబంధ కులాల వారి ఓట్లు చిరంజీవి పార్టీకి ఆశించిన స్ధాయిలో పడలేదు.

ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేని పార్టీని నడపడం కంటే కాంగ్రెస్ లో విలీనం చేసి రెండు రాజ్యసభ సభ్యత్వాలు, ఇతర డిమాడ్ల సాధన ఉత్తమమని చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్ అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, నాగబాబులు ఎన్నికల తర్వాత ప్రజారాజ్యానికి దూరంగా ఉండడం వల్ల కూడా చిరంజీవికి పార్టీ మీద మోజు తగ్గిపోయినట్టు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X