హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు అల్లుడి భారీ ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

Srija-Sirish Bharadwaj
హైదరాబాద్: రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ ఉవ్విళ్ళూరుతున్నాడు. తనకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి అని నిన్న తిరుమలలో విలేకరులతో అన్నాడు. ఆ సమయంలో భార్య శ్రీజ, ఆయన తలిదండ్రులు అక్కడే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేయడానికి తాము సిద్ధమని గతంలో ఈ జంట మరో పుణ్యక్షేత్రంలో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నాన్న చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని శ్రీజ చెప్పింది. ప్రజారాజ్యంలోకి తనను ఆహ్వానిస్తే చేరుతానన్న ఎక్స్ ప్రెషన్ శిరీష్ మొహంలో కన్పిస్తోంది. శిరీష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడో లేదో తెలియదు. అతను ఏ ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తున్నట్టు కానీ కన్పించడం లేదు. శ్రీజ పేరుతో ఉన్న డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతోనే వారు జీవనం సాగిస్తున్నట్టు కన్పిస్తోంది.

శిరీష్ భరద్వాజ్ ఖైరతాబాద్ సిటింగ్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డీకి మిత్రుడు. విష్ణు పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు. శ్రీజ, శిరీష్ ల పెళ్ళిని ఆర్యసమాజంలో జరిపించింది విష్ణు, అతని మిత్రులే. వారే ఒక పథకం ప్రకారం పెళ్ళి జరిపించి, ఆ జంటను ఢిల్లీ పంపించినట్టు తెలుస్తోంది. విష్ణు అనుచరుడిగా కాంగ్రెస్ లో చేరితే ఒక స్ధాయికి చేరడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అదే మామ చిరంజీవి పార్టీలో చేరితే నగరంలోనే ఒక అసెంబ్లీ టికెట్ కొట్టేయవచ్చు. ఈమధ్యనే శిరీష్ కు ఎన్నికల్లో పోటీ చేసే వయసు వచ్చిందని చెబుతున్నారు.

శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల వివాహాన్ని చిరంజీవి మొదట అంగీకరించలేదు. కానీ అలాగని ఆయన తీవ్రంగా వ్యతిరేకించిందీ లేదు. సినిమాల్లో తాను పేదవాడైనా, గొప్పింటి అమ్మాయిలను ఎందరినో చిరంజీవి లేవదీసుకుపోయి పెళ్ళాడారు. ఆయన నిజ జీవితంలో తన కూతురి ప్రేమను ఎందుకు అంగీకరించలేదని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడానికి, తనకు కులాభిమానం లేదని చెప్పుకోడానికైనా శిరీష్ కు ప్రజారాజ్యంలో స్ధానం కల్పిస్తారన్న అభిప్రాయం అతని మిత్రుల్లో ఉంది. శ్రీజ-శిరీష్ లు బేగంపేటలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ లో కాపురం ఉంటున్నారు. ఆ ఫ్లాట్ ఎవరు కొనిచ్చారో వేరే చెప్పాలా? శిరీష్ కు మరిన్ని శుభాలు కలగాలని ఆశిద్దాం. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు పంపుకోడానికి కింద ఉన్న "ఇ-మెయిల్" ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X