• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్యం రాజు రామదాసా?

By Staff
|

Ramalinga Raju
హైదరాబాద్: "సీతాకు చేయిస్తి చింతాకు పతకం" అంటూ రాముడికి ఆవేదనతో భక్త రామదాసు నివేదించుకుంటాడు. సత్యం రామలింగరాజు పరిస్ధితి అదేవిధంగా ఉంది. మేటాస్ సంస్ధల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో లోపాయికారీగా 'టచ్' పెంచుకున్న ఆయన భారీగానే మూల్యం చెల్లించుకున్నారు. మేటాస్ మౌలికంగా నాన్ ఐటి సంస్ధ. రియల్ ఎస్టేట్, నిర్మాణాలు దాని ఏరియాలు. ఆ ఏరియాలో ఉన్న కంపెనీలు అధికారంలో ఉన్న వారికి భారీగా ముడుపులు చెల్లించుకోవలసి ఉంటుంది. జిఎంఆర్, జివికెలు కూడా అలా భారీ ముడుపులు చెల్లించుకునే మనుగడ సాగిస్తున్నాయి. సత్యం బోర్డును తిరగేసుకుని కొడుకు పేరుతో రామలింగరాజు ఎప్పుడైతే మేటాస్ (సత్యం అక్షరాలకు రివర్స్ గేర్) పెట్టుకున్నారో ఈ రెండు సంస్ధలు కార్పొరేట్ వ్యూహాలను బయటికి తీశాయని మేనేజ్ మెంట్ నిపుణులు చెబుతున్నారు. రామలింగరాజు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి వస్తే తమను తినేస్తాడని వారి భయం కావచ్చు.

మేటాస్ కొన్ని వందల ఎకరాల భూములను కొనుగోలు చేసింది. మరికొన్ని వందల ఎకరాలకు అడ్వాన్సులు ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో సత్యం కంపెనీలో సంక్షోభం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టును చేజిక్కించుకోడానికి సత్యం రాజు ఎన్నో కిక్ బ్యాక్స్ ను రాజకీయ నాయకులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అంతా అయిపోయినా ఆదాయాలు తిరిగిరాకపోవడంతో రాజుగారచె"చెయ్యి" కలిపిన పాపానికి చేతులెత్తక తప్పలేదు.

రామలింగరాజు బెయిల్ కోసం సీరియస్ గా ప్రయత్నించకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. బయటికి వస్తే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, జైలే పదిలమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్టయిన కొత్తలో ఒక వ్యాఖ్య చేశారు "నేను పులి మీద స్వారీ చేశాను. ఆ పులి తినేస్తుందని తెలిసినా అలా చేయవలసి వచ్చింది" అన్నారు. ఆ వ్యాఖ్యలు పులివెందులను ఉద్దేశించి చేసినవేనని పరిశీలకులు అంటున్నారు.

రామలింగరాజు, రాజశేఖరరెడ్డి మధ్య కుదిరిన రహస్య అవగాహన ఆ తర్వాత ఎలా బెడిసికొట్టిందో ప్రతిపక్షపార్టీలు సమర్ధంగా బయటపెట్టలేకపోయాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా సత్యంరాజుకు వరాలు ఇవ్వడం ఇందుకు ఒక కారణం కావచ్చు. బిల్ గేట్స్ పక్కన రాజును కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడికి భారీగా సత్యం షేర్లు లభించినట్టు అందరికీ తెలిసిన విషయమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X