హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు ఎన్టీఆర్ అండ?

By Santaram
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: తండ్రిని కోల్పోయి, వ్యాపారాల్లో నష్టపోయి భోరున విలపిస్తున్న జగన్ ను ఆదుకోడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. వరద బాధితుల కోసం తాత గారిలా ఉదారంగా వ్యవహరించిన జూనియర్ రాజకీయాల విషయంలో తాతగారి కంటే నిక్కచ్చిగా ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు.

తెలుగుదేశం అధికారంలోకి రానప్పటినుంచి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. జూనియర్ ప్రచారం చేసిన అనేక నియోజకవర్గాలో తెలుగుదేశం అభ్యర్ధులు పరాజయం పాలు కావడంతో "వాడుకుని వదిలేసే" అలవాటున్న చంద్రబాబు చిన్న ఎన్టీవోడిని దూరంగా పెట్టారు. చంద్రబాబు ధోరణికి జూనియర్ తండ్ర్రి హరికృష్ణ కూడా మనస్ధాపం చెందినప్పటికీ ఆయన మౌనంగా ఉంటున్నారు. వ్యక్తిగత స్పర్ధల కంటే కుటుంబ గౌరవం ముఖ్యమని హరికృష్ణ భావించి ఉండవచ్చు.

ఈ నేపధ్యంలో యువ నాయకుడైన వైఎస్ జగన్ పట్ల జూనియర్ ఆకర్షితుడైనట్టు తెలుస్తోంది. జగన్ కాంగ్రెస్ పార్టీని చీల్చితే ఆయనకు మద్దతుగా నిలవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం 35 మంది ఎమ్మెల్యేలను జగన్ కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి జూనియర్ సిద్ధపడినట్టు చెబుతున్నారు. అయితే తాతగారు మరణించేవరకూ కాంగ్రెస్ మీద అవిశ్రాంతంగా పోరాడారు. మరి జూనియర్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారడం సీనియర్ ఎన్టీఆర్ ఆత్మశాంతికి విఘాతం కాదా? సీనియర్ కుమార్తె, అల్లుడు కాంగ్రెస్ లో చేరి చక్రం తిప్పడం లేదా? పురంధరేశ్వరే జూనియర్ కు పురెక్కించి, జగన్ కు అనుకూలంగా ఉండమని చెప్పి ఉండవచ్చు కదా? గతంలో కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మవద్దని, నీ మనుషులు కొంతమందికైనా టిడిపి టికెట్ల్లు ఇప్పించుకుని గట్టిగా ఉండమని పురంధరేశ్వరి జూనియర్ కు హితోపదేశం చేసినట్టు సమాచారం. మరిన్ని వివరాలకు రేపటి టాక్ ఆఫ్ టుడే చదవండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X