ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును ఉరితీయాలన్న పోసానిపై పోలీసు కేసు

By Santaram
|
Google Oneindia TeluguNews

Posani krishna Murali
హైదరాబాద్: ఈమధ్య తెలుగు సినిమా రంగానికి చెందిన వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వివాదాస్పదమవుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఉరితీయాలంటూ ఆమధ్య "సాక్షి" టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత, దర్శకుడు, ప్రజారాజ్యం నాయకుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించడం తెలిసిందే. చంద్రబాబు క్రిమినల్ అని మోసగాడని ఫోసాని అన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణను మెత్తని మాటలతో అయినా ఈ మెంటల్ కృష్ణ కడిగిపడేశాడు. పోసానిని ఇలా వదిలేస్తే కష్టమనుకున్నారో ఏమో ఒంగోలుకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాడు. పోసాని చంద్రబాబుపై చేసిన తీవ్ర విమర్శలనే అతను కేసుకు మూలంగా తీసుకున్నాడు.

టాలీవుడ్‌ హీరోలు మగాళ్లు కారు' అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ చేసిన ప్రకటన ఇంకా టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇలా ప్రకటించటం పద్దతి కాదంటూ ఎ.పి. సినీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఒ.కళ్యాణ్‌ తప్పుపట్టారు.ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేసారు. ఆ లేఖలో తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల మగతనం గురించి మాట్లాడే ముందు భరద్వాజ్‌ తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే 'తారే జమీన్‌ పర్‌' వంటి చిత్రాన్ని తెలుగులో తీయాలనుకుంటే ఒప్పుకునే హీరోలు ఉన్నారా అని భరద్వాజ్‌ వేసిన ప్రశ్నను ప్రస్తావిస్తూ ఘాటు ప్రశ్నలు వేసారు.

దాదాపు నెల రోజుల క్రితం చిరంజీవిపై మోహన్ బాబు పరోక్షంగా గుప్పించిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. చిరంజీవికి ప్రజల పట్ల బాధ్యత ఉంటే స్టార్ నైట్ సన్నాహక సమావేశానికి ఎందుకు రాలేదని మోహన్ బాబు ప్రశ్నించారు. ఇంకా చాలా డైలాగులు కొట్టారు. ఒక దశలో పరిశ్రమలో చీలిక వస్తుందని భయపడిన రాఘవేంద్రరావు, రామానాయుడు వంటి వారు చొరవ తీసుకుని ఫోన్ ల ద్వారా చిరంజీవి, మోహన్ బాబులకు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది.

ఇలా ఇతరులపై తీవ్ర విమర్శలు చేసిన వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. తాను కమ్మ అని పోసాని ఒక పత్రికా ప్రకటనలో బాహాటంగా చెప్పుకున్నారు. అయినా తాను చిరంజీవి ఆశయాలు నచ్చి ఆయన పార్టీలో చేరానని చెప్పుకున్నారు. సినిమా రంగంలో ఒక సామాజిక వర్గం వారే ఇలా రెచ్చిపోవడం, మిగితా వర్గాల వారు ప్రేక్షకపాత్ర వహించడం వెనుక కారణాలను లోతుగా విశ్లేషీంచవలసిన అవసరం ఉందేమో!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X