హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజుకి అదొక్కటే తక్కువ

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: చంచల్ గుడా జైల్లో సత్యం రామలింగరాజు నిన్న రెండో శత దినోత్సవం జరుపుకున్నారు. ఆయన జైలు పాలై నిన్నటికి 200 రోజులు పూర్తయ్యాయి. జైల్లో రామలింగరాజుకు, ఆయన తమ్ముడు రామరాజుకు రాచమర్యాదలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరికి మరో ఫోర్ ట్వంటీ కృషి బ్యాంక్ కొసరాజు వెంకటేశ్వరావు తోడయ్యాడు. జైలు అధికారులను సిబ్బందిని, చిల్లర ఖైదీలను ఎలా ప్రలోభపెట్టాలో వెంకటేశ్వరరావు సత్యం రాజులకు ట్రెయినింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. రావు మోసం 30 కోట్లు అయితే, రాజుల మీద ఉన్న మోసం కేసు విలువ ఏకంగా 7 వేల కోట్లు. కొన్నేళ్ళుగా జైల్లో ఉంటున్న కొసరాజు వెంకటేశ్వరరావు జైలు అధికారులను లోబర్చుకుని సకల సౌఖ్యాలు ఎలా అనుభంచాలన్న దానిలో పండిపోయాడు.

కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు తన భార్యను నెలకోసారి జైలుకు రప్పించుకుని, అక్కడే ఒక గదిలో "శోభనం" జరిపించుకుంటాడని డెక్కన్ పోస్ట్ అనే ఆంగ్ల వారపత్రిక గత ఏడాది ప్రచురించిన కవర్ స్టోరీ సంచలనం సృష్టించింది. అటువంటి కొసరాజు వెంకటేశ్వరరావుకు జైల్లో సకల సౌఖ్యాలు ఎలా అనుభవించాలో సత్యం రాజులకు బోధించడం కష్టమా?

ఈ రాజుల కోసం చంచల్ గుడా జైల్లో ప్రత్యేక వంటశాల ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీరి కోసం షటిల్ కోర్టుకు కూడా ఏర్పాటు చేశారట. కొసరాజే కాకుండా సత్యం రాజులు కూడా యధేచ్చగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ లను యధేచ్చగా ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చంచల్ గుడా జైలులోని ఓల్డ్ ఆస్పత్రి బ్యారక్ లో ఉండే ఎనిమిది గదుల్లో మొదటి గదిని సత్యం రాజు సోదరులకు కేటాయించారు. సమీపంలోని మరో బ్యారక్ లో కృషీ వెంకటేశ్వరరావు ఉంటున్నారు.

సత్యం రాజు సోదరులు జైలుకు వచ్చే ముందే తమ దైనందిన చర్యలను ఫిక్స్ చేసుకున్నట్టు కన్పిస్తోంది. రాజు సోదరులు ఉదయం లేవగానే యోగా, వ్యాయామం చేస్తున్నారు. ఆ తర్వాత ఇష్టమైన అల్పాహారాన్ని తమ కిచెన్ రూములో చేయించుకుని తింటున్నారు. ఉదయం ఉడకబెట్టిన కూరగాయలను, గైండ్ చేసిన ఫ్రెష్ కూరగాయల రసాలను తీసుకుంటున్నారని కొందరు జైలు సిబ్బంది చెబుతుండగా మరికొందరి కథనం వేరుగా ఉంది. రామలింగరాజు సోదరులు దేశంలోనే అత్యంత ఖరీదైన సాల్మన్ చేపలను, టైగర్ ప్రాన్స్ ను తెప్పించుకుని తరచుగా వండించుకుని తింటున్నారని మరో కథనం. బ్రేక్ ఫాస్ట్ తర్వాత దినపత్రికలు చదవడం, ఆ తర్వాత లైబ్రరీ గదిలోకి వెళ్ళి మిత్రులకు సెల్ ఫోన్ల ద్వారా షేర్ల ట్రేడింగ్ టిప్స్ ఇవ్వడం చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. జైల్లో సెల్ ఫోన్ వాడడం నిషిద్ధమని అందరికీ తెలుసు. కానీ రాజులకు మాత్రం అక్కడ అక్రమ మినహాయింపు ఇచ్చారు జైలు సిబ్బంది. ఇన్సెస్టర్లను ముంచడంలో సిద్ధహస్తుడైన రామలింగరాజుకు జైలు సిబ్బందిని ఆహారం, ఇతర విషయాల్లో ఎలా మభ్యపెట్టాలో చెప్పి కృషి బ్యాంక్ వెంఖటేశ్వరావు పాపం పుణ్యం కట్టుకున్నాడు. ఇంకా తాను జైల్లోనూ అనుభవిస్తున్న సుఖాలను వీరికీ పరిచయం చేస్తాడేమో. జగమే రామమయం అనుకోవాలి, పుణ్యం వస్తుంది. జగమే మోసాల మయం అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జి వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X