హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య మరికొంతకాలం?

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్:ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను మరికొంతకాలం కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైఎస్ తనయుడు జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవంగా ఆ డిమాండ్ చేశారు. దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు వైఎస్ కు అనుకూలంగా సంతకాలు చేశారు.జగన్ కు అనుకూలంగా నిన్న కడపలో పార్టీలకు అతీతంగా పెద్ద ర్యాలీ జరిగింది.

డెబ్బై ఏళ్ళు దాటినా గట్టిగా ఉన్న రోశయ్య భగవద్గీతా వాక్యాలను పాటించే వ్యక్తి. "నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఫలితం గురించి ఆలోచించవద్దు" అనే గీతా వాక్యాన్ని పాటిస్తూ ఎంతో మంది ముఖ్యమంత్రులకు నెంబర్ టూ గా వ్యవహరించిన రోశయ్యకు ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. జగన్ కు రాజకీయ అనుభవం లేకపోవడం, ముఖ్యమంత్రి పది కోసం తొందరపడడం మైనస్ పాయింట్లుగా మారాయి. పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనకు మైనస్ పాయింట్. కేంద్రమంత్రిగా హాయిగా ఉన్న జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రిగా వచ్చి తలనొప్పులు తెచ్చుకోవలసి అవసరం కన్పించడం లేదు.

ఈ నేపధ్యంలో రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్యవైశ్య సంఘం, వర్తక సంఘాలు రోశయ్యకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారి సహకారం తీసుకుని రోశయ్య నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకువస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని జనం అనుకునే పరిస్ధితి వస్తుంది. రోశయ్య తనకున్న ఈ పరపతిని ఉపయోగించి చర్తక సంఘాలను ఒప్పించగలిగితే బాగుంటుంది. కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆర్యవైశ్య నాయకుడు టిజి వెంకటేష్ రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X