హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలకు ప్రాధాన్యం

By Staff
|
Google Oneindia TeluguNews

Sabith Indra Reddy
హైదరాబాద్‌: ఒక మహిళకు హోంశాఖను కట్టబెట్టి రాజశేఖరరెడ్డి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన శాఖలో మహిళలకు పెద్ద పీట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయమే. రాష్ట్ర పోలీసు విభా గం మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. లేడీ బాస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోంశాఖ ఇప్ప టికే మంచి మార్కులు సాధించగా తాజాగా పోలీసు విభాగంలో మహిళలకు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని కీలకమైన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిగా సబితారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలీసుశాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తించి ఈ సంఖ్యను పెంచేం దుకు కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. హోం మంత్రి హామీ ప్రభావమో.....? లేదా మరే మహ త్యమో..? తెలియదు కానీ పోలీసు విభాగంలో మహిళలకు ప్రాధాన్యత పెరగసాగింది. పోలీసు శాఖ త్వరలో నిర్వహించబోయే భర్తీల్లో సివిల్‌ విభా గానికి సంబంధించి ఐదుశాతం కోటాను మహిళ లకు కచ్చితంగా అమలు చేయాలని ఉన్న తాధికా రులు నిర్ణయించారు. పోలీసు శాఖలో మహిళలకు ఇప్పుడున్న ఒక శాతంలోపు రిజర్వేషన్‌ను మూడు నుంచి ఐదు శాతానికి పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రకటించిన 37వేల మంది పోలీసుల భర్తీలో ఇంకా 20వేల పోస్టు లు మిగిలి వున్నాయి.

ఇందులో సివిల్‌ విభా గం పోస్టులు 70శాతం ఉండగా మిగతావి సాయుధ బలగానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఈ పోస్టుల్లో ఒక్క హైదరా బాద్‌లోనే ఐదు వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఈ లెక్కన నగర పోలీసు విభాగం భర్తీలో 250మంది మహి ళలు నియమితులు కానున్నారు. ఇటీవల జరిగిన భర్తీల్లో ఈ రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేయడం విశేషం. సిటీ పోలీసు విభాగంలో ఇప్పుడున్న పోలీ సులతో కలిపితే వీరి సంఖ్య ఐదు వందలు దాటు తుంది. హోంగార్డు లతో కలిపితే ఈ సంఖ్య వెయ్యి వరకు చేరుతుంది. హైదరాబాద్‌తోపాటు సైబరాబా ద్‌, విజయవాడ, విశాఖపట్నంకమిషనరేట్లలోనూ మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని సర్కారు నిర్ణయించింది.

సివిల్‌ విభాగంలో జరిగే భర్తీల విషయం అలా వుంచితే సాయుధ బలగంలోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హోంశాఖ చేసిన ప్రతి పాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లా పోలీసు విభాగాలకు అనుబంధంగా వుండే సాయుధ బలగాలతోపాటు ఏపీఎస్‌ పీ విభాగంలోనూ మహిళలకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాయుధ బలగం (రిజర్వ్‌ పోలీసు విభాగం)లోనే మహిళలకు కొంత వర కు ప్రాధా న్యం వుంది. దీనిని మరికొంత పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు ఎపీఎస్‌ిపీ లోనూ మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తమిళనాడు తరహాలో మహిళా బెటాలి యన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని సర్కారు తీవ్రంగా పరిశీలిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X