హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ రిటైర్మెంట్ ఎప్పుడు?

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాజశేఖరరెడ్డి పదేళ్ళ క్రితం తన నాయకత్వంలోని కాంగ్రెస్ కాకుండా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం విజయం సాధించినప్పుడు నిస్పృహకు లోనయ్యారు. రాజకీయ నాయకులు అరవై ఏళ్ళకు రిటైరైతే బాగుంటుందని, తాను కూడా అలా చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డికి అరవై ఏళ్ళు నడుస్తున్నాయి. గత వారమే ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు. మరి ఆయన రిటైర్మెంట్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదేమిటి? ఐదేళ్ళ క్రితమే ఆయన ఊహించని విధంగా అధికారం వచ్చింది. ఆపై సోనియా నాయకత్వంలోని అధిష్టానవర్గం ఆయనకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది. తాను అనుకున్న స్కీంలను అమలు పరిచి, తన మనుషులకు టికెట్లు ఇచ్చుకుని ఆయన రెండోసారి కూడా ఆశ్చర్యకరంగా మెజారిటీ తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు ప్రజానాయకుడిగా మారిన రాజశేఖర రెడ్డి రిటైర్ అవుతానన్నా జనం ఒప్పుకోరేమో. కానీ వచ్చే ఐదేళ్ళలో అయినా కాంగ్రెస్ నాయకులు ధనాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమం కోసం అభి వృద్ధి కోసం కృషి చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. కెవిపి రామచంద్రరావు, వైఎస్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యావసర వస్తువుల అధిక ధరలు వారికి లొంగడం లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని వారు సరి పెట్టుకుంటున్నా, జనానికి అంత నాలెడ్జి ఉండదు కదా. అధిక ధరలకు కారణం వైఎస్సేనని అనుకునే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపధ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత తేలిక కాకపోవచ్చు.

ప్రత్యర్ధి పార్టీలలో చిచ్చు పెట్టడం, నన్నపనేని రాజకుమారి వంటి మహిళా నాయకులపై దాడులు చేయించడం, టిడీపి దళిత ఎమ్మెల్యే రామారావుపై కక్ష సాధించడం వైఎస్ కు మంచి తెచ్చే విషయాలు కావు. కందిపప్పు కిలో వందకు ఎగబాకడం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోటులో కుంగిపోయి ఉంది. చిరంజీవి పార్టీని, టీఅర్ ఎస్ ను వైఎస్ చావు దెబ్బతీశారు. ఆ చిచ్చు టిడిపిలో కూడా రగులుతోంది. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా మరో ఐదేళ్ళ నాటికి జనం మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఆయన ఇరిగేషన్ ప్రాజెఖ్తులు, సెజ్ ల మీద కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమేమో.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X