వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీతో స్వామి నిత్యానంద సెక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాలు నెరుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానంద మరింత చిక్కుల్లో పడ్డాడు. బెంగళూర్ శివారులోని బీదాడిలో గల నిత్యానంద స్వామికి చెందిన ధ్యానపీఠ ఆశ్రమంలో సెక్స్, మద్యసేవనానికి అంతు లేదని ఓ టెక్కీ సిఐడి అధికారుల ముందు చెప్పింది. నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఈ టెక్కీ అత్యాచారానికి గురైన బాధితురాలని తెలుస్తోంది. ఆశ్రమంలో నిత్యానంద స్వామికి శిష్యురాలిగా చేరే ముందు ఆమె సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేది. తనపై స్వామి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించింది. తనతో సెక్స్ లో పాల్గొనడం గొప్ప మానవ సేవ అని తనను స్వామి నిత్యానంద ఊరడించే ప్రయత్నం చేశాడని చెప్పింది.

ఆ టెక్కీ పేరును గోప్యంగా ఉంచారు. ఆమె 2006 ఆగస్టు నుంచి 2006 డిసెంబర్ వరకు ఆమె నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఉంది. ఆశ్రమానికి మద్యం తేవాలని స్వామి తనకు ఓ రోజు చెప్పాడని కూడా ఆమె సిఐడి అధికారుల ముందు వెల్లడించింది. దాని గురించి ప్రశ్నిస్తే, ఈగోను వదిలేయాలని, తాను మాస్టర్ ను కాబట్టి తన మాట వినాలని చెప్పాడని వివరించింది. గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఏ స్త్రీ కూడా మద్యం దుకాణానికి వెళ్లదని, తనకు అక్కడ ఆ విధమైన అవమానం జరిగిందని, మైసూరు - బెంగళూర్ హైవేపై గల మద్యం దుకాణానికి వెళ్లానని ఆమె చెప్పింది.

తనకు కంపెనీ ఇవ్వాలని స్వామి అడిగాడని, అంత శక్తివంతమైన ఆల్కహాల్ తీసుకోవడం తనకు అలవాటు లేదని, ఆ మద్యం సేవించడంతో ఏమవుతోందో కూడా తెలియలేదని, కొన్ని గంటల తర్వాత నిత్యానంద తనను లేపాడని, పడకపై తాను నగ్నంగా పడుకుని ఉన్నట్లు తెలుసుకున్నానని ఆమె ఆరోపించింది. బట్టలు వేసుకని వెళ్లిపోవాలని నిత్యానంద చెప్పాడని, నిత్యానంద పెట్టిన నిబంధనల ప్రకారం ఆశ్రమంలో మద్య నిషేధం ఉందని ఆమె వివరించింది.

నిత్యానంద 2006 మేలో తనను లాస్ వేగాస్ ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడని, తనను లాస్ వేగాస్ లోని స్ట్రిప్ క్లబ్ కు తీసుకుని వెళ్లాడని, తన కాషాయ వస్త్రాలు వదిలేసి టీ - షర్ట్, జీన్స్ ధరించాడని, తన పాపులారిటీ పెరుగుతోంది కాబట్టి ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా చేస్తున్నానని చెప్పాడని ఆమె వివరించింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనను గదికి పిలిపించుకున్నాడని, స్ట్రిప్ టీజ్ చేయాలని చెప్పాడని, ఆ తర్వాత సెక్సీ వస్త్రాలు, కండోమ్స్, మేకప్, రెడ్ లిప్ స్టిక్ కొనాలని ఆ తర్వాత చెప్పాడని ఆమె చెప్పింది. తనతో సెక్స్ చేసేప్పుడు నిత్యానంద కండోమ్స్ వాడేవాడని, వాడిన తర్వాత కండోమ్స్ ను తీసి జాగ్రత్తగా దాచిపెట్టేవాడని ఆమె చెప్పింది. టెక్కీ ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు రామ్ నగర్ జిల్లా కోర్టుకు సమర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X