వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఇష్టమైంది

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఏ గమ్మత్తయిన ఘడియలోనో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అది కొంత మంది ప్రోద్బలం వల్ల ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. దాని వెనక ఆయన బావ మరిది, చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రధాన భూమిక పోషించ ఉండివచ్చు. దానికి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ చేతులు వేసి ఉండవచ్చు. వారందరూ చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠం మీద చూద్దామనే కోరుకుని ఉంటారు. వారి కోరికలో కూడా అసహజమైందేమీ లేదు. చిరంజీవికి ఉన్న మాస్ ఫోలోయింగ్ అధికారాన్ని అందిస్తుందని భావించి ఉండవచ్చు. చిరంజీవికి కూడా అదే నమ్మకం కలిగి ఉంటుంది. అందుకనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి ముందు పెద్ద కసరత్తే చేశారు. కానీ తీరా, మైదానంలోకి దిగిన తర్వాత ఓటమి పాలు కాక తప్పలేదు. అనూహ్యమైన రీతిలో ఆయన అపజయం పాలయ్యారు. తన సొంత ఊరిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇది చిరంజీవికి, ఆయన కుటుంబ సభ్యులకు, చిరంజీవి ఇమేజ్ పై ఆశ పెట్టుకుని ప్రజారాజ్యంలోకి వచ్చినవారికి పెద్ద దిమ్మ తిరిగే దెబ్బ.

అయితే, ఇటీవలి కాలంలో చిరంజీవి మాటలు, చేతలు ఆయనకు రాజకీయాలపై కన్నా సినిమాలపై ఎక్కువ మక్కువ అనేది తెలియజేస్తున్నాయి. సినిమా విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఆయన మనసు భావోద్వేగానికి గురి కావడం చూస్తాం. రాజకీయాలపై ఆయనకు విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు. కానీ, ఓసారి దిగిన తర్వాత ఆట ఆడక తప్పదనే పరిస్థితిని ఆయన ఎదుర్కుంటున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆయన సేఫ్ గేమ్ ఆడదలుచుకున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసుకు ఆయన దగ్గర కావడంలోని అసలు విషయం అదే. కాంగ్రెసులో చేతులు కలిపిన తర్వాత ఆయనకు వెసులుబాటు కూడా లభించింది. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉన్నదానితో కాంగ్రెసుతో బేరసారాలు సాగించవచ్చు. లేదా అనివార్యమైతే పార్టీని కాంగ్రెసులో విలీనం చేయవచ్చు. అందుకే ఆయన ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి సినిమాలపైకి తన దృష్టిని మళ్లించారు. తనకు ఇష్టమైన పని చేయడానికి ఆయన ముందుకు దూకుతున్నారు.

ఇష్టమైన పనే అయినా దాన్ని కూడా తన రాజకీయానికి వచ్చే విధంగా మలుచుకోవడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. బహుశా, ఆయన సినిమా ఇతివృత్తం సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించిందై ఉంటుంది. తన 150వ సినిమా ఠాగూర్ లాగానో, స్టాలిన్ లాగానో ఉండాలనే మాటలోని ఆంతర్యం అదే. అయితే, దానికి పకడ్బందీ కథను తయారు చేయడం కావాలి. దాన్ని అంతకన్నా పకడ్బందీగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. ఆ సినిమా విడుదలైన తర్వాత భవిష్యత్తు రాజకీయాలకు అది ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందుకు అనుగుణంగానే కథా ఎంపికలోనూ, దర్శకుడి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే తాము కథ కోసం వెతుకుతున్నామని చెప్పారు. ఇక్కడ కథే ముఖ్యం. చిరంజీవి ఇమేజ్ ఎలాగూ తోడవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X