వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోబోకు షాక్ తగులుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Robo
తెలుగులో నాలుగు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ నాలుగు సినిమాలు కూడా రెండు వారాల్లోగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏవి నిలబడుతాయి, ఏవి ఎగిరిపోతానేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు సినిమాలు కూడా పెద్ద హీరోలతో భారీ అంచనాలతో వస్తున్నాయి. భారీ పెట్టుబడులతో ఆ సినిమాలను నిర్మించారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి సినిమాలు తీశారు. ఆ మేరకు సినిమాలు ఆడుతాయా, లేదా అనేది సందేహాస్పదంగా మారింది. రజనీకాంత్ హీరోగా నటించిన రోబో, మహేష్ సినిమా ఖలేజా, జూనియర్ ఎన్టీఆర్ బృందావనం, పవన్ కళ్యాణ్ కొమరం పులి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. కొమరం పులి ఈ నెల 9వ తేదీన విడుదలవుతుంటే, బృందావనం అక్టోబర్ 1వ తేదీన విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మిగతా రెండు సినిమాలు కూడా ఈ సమయాల్లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నాలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం, వాటిని తగినన్ని రోజులు నడిపించడం అవసరంగా మారింది. ఆ రకంగా నడిస్తే తప్ప లాభాలు ఆర్జించే స్థితి లేదు. వీటిలో రోబో సినిమాకు భారీగా కలెక్షన్లు రావాల్సి ఉంటుంది.

తెలుగు హక్కులను ఓ డిస్ట్రిబ్యూటర్ 27 కోట్ల రూపాయలు పెట్టి దక్కించుకున్నారు. ఆ మొత్తం రావాలంటే భారీగా కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఈ సినిమాకు ఆ మొత్తం రావాలంటే 800 థియేటర్లు కావాల్సి ఉంటుంది. కనీసం నెల రోజులైనా సినిమా ఆడాలి. డిస్ట్రిబ్యూటర్ కేవలం తెలుగు హక్కులను మాత్రమే దక్కించుకున్నారు. ఈ సినిమా మిగతా మూడు సినిమాల నుంచి కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కొమరం పులి రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. లాభాలు రావాలంటే ఈ సినిమా తప్పకుండా మూడు వారాలు ఆడాలి. పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత వస్తోంది కాబట్టి ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. తొలి రోజుల్లో కలెక్షన్లకు కూడా కష్టం ఉండకపోవచ్చు. మహేష్ బాబు సినిమా విడుదలైతే కొమరం పులిపై దెబ్బ పడవచ్చు. మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. రోబో నుంచి కూడా కొమరం పులి పోటీని ఎదుర్కోవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం అక్టోబర్ 1వ తేదీన వస్తోంది. దానికి లాభాలు రావాలంటే ఆ సినిమా నాన్ స్టాప్ గా మూడు వారాలు ఆడాల్సి ఉంటుంది. దీనికి కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. అయితే, కొమరం పులి, రోబో, ఖలేజాల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది విడుదలైన కొద్ది రోజులకే ఖలేజా విడుదలైతే బృందావనం సినిమా కలెక్షన్లపై ప్రభావం పడవచ్చు. కనీసం అక్టోబర్ రెండో వారంలోనైనా ఖలేజా సినిమాను విడుదల చేయాల్సి వస్తుంది. ఈ స్థితిలో భారీగా పెట్టుబడులు పెట్టిన సినిమా రోబో. మూడు భారీ సినిమాల మధ్య రోబో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోతే హక్కులు సాధఇంచిన డిస్ట్రిబ్యూటర్ భారీగా నష్టాల పాలు కావాల్సి వస్తోంది. బహుశా ఈ పోటీని దృష్టిలో ఉంచుకునే కావచ్చు, విడుదల తేదీలను ఖరారు చేయడం లేదు. కొమరం పులి కూడా సెప్టెంబర్ 9వ తేదీన విడుదలవుతుందా అనేది సందేహమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X