వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ మాఫియాతో హీరోలకు లింక్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bharat
హైదరాబాదులో డ్రగ్ మాఫియా పెను ముప్పుగా పరిణమించింది. హైదరాబాదులో సంపన్న వర్గాలు, సెలిబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం ముమ్మరంగా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకు సంబంధించి తనకు తగిన సాక్ష్యాధారులు లభించాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి స్టీఫెన్ రవీంద్ర అంటున్నారు. ఇటీవల డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయులను, ముఖ్యంగా నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో హీరో రవితేజ సోదరులు పోలీసులకు డ్రగ్స్ సేవించి పట్టుబడ్డారు. నిర్మాత వెంకటేశ్వర రావు కూడా డ్రగ్స్ తో గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. రవితేజ సోదరులు పట్టుబడినప్పుడే చాలా వరకు పోలీసులు తీగ లాగారు. దీంతో సినీ పరిశ్రమ డొంక కదిలే పరిస్థితి వచ్చింది.

కాగా, తాజాగా తెలుగు సినిమాకు చెందిన నలుగురు హీరోలకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొంత మంది నిర్మాతలకు, రాజకీయ నాయకులకు కూడా సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. కచ్చితమైన ఆధారాలతో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నవారిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. గతంలోనే సినీ పరిశ్రమలోని పలువురు హీరోలకు, హీరోయిన్లకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు ప్రచారం జరిగింది.

ఉదయ్ కిరణ్ వంటి హీరోలు, త్రిష వంటి హీరోయిన్లు తమపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను ఖండించారు. అయితే, అప్పటి నుంచి పోలీసులు డ్రగ్ మాఫియాపై ఓ కన్నేసి ఉంచారు. అప్పట్లో వ్యభిచారం చేస్తూ వర్దమాన తారలు పోలీసులకు దొరికారు. ఈ వ్యభిచార వ్యవహారాలకు, డ్రగ్ మాఫియాకు గల సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. డ్రగ్ మాఫియాతో సెలిబ్రిటీల లింకులపై ఆషామాషీగా వ్యవహరించకూడదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X