వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చే గువేరా దుశ్శాసనుడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Che Guevara
సినీ రచయిత, దర్సకుడు పోసాని కృష్ణ మురళికి గమ్మత్తయిన ఆలోచనలు వస్తుంటాయి. తాను రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఆ మధ్య ఆయన ధుర్యోదన అనే సినిమా తీశారు. ఆయన చెప్పే ఆదర్శవంతమైన మహాత్ముల పేర్లు చెప్పారు. ఆ పేర్లు పరస్పర విరుద్ధమైన ఆశయాలకు సంబంధించినవి. ఒక రకంగా తనను తానే ఖండించుకున్నట్లుగా పోసాని ప్రొజెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మరో సాహసానికి ఒడిగట్టాడు. శ్రీకాంత్ హీరోగా ఆయన దుశ్సాసనుడు అనే సినిమాను తీయడానికి పూనుకున్నారు. దుశ్సాసనుడిగా ఆయన చే గువేరాను చూపించబోతున్నారట. ఆయన అద్భుతమైన పరిజ్ఞానానికి జోహర్లు అర్పించక తప్పదు. చే గువేరాను పోలిన వేషాన్ని వేయించారు. దీంతో ఒక్కసారిగా మార్క్సిస్టులు ఉలిక్కి పడ్డారు. గొడవ ప్రారంభించారు. ఓ టీవీ చానెల్ దానితో పండుగ చేసుకుంది. చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పోసాని కృష్ణ మురళికి కావాల్సినంత పబ్లిసిటీ కూడా లభించింది.

చే గువేరా సిద్దాంతాలు నచ్చకపోయినా ఆయనను తప్పు పట్టే పరిస్థితి ప్రపంచంలోనే లేదు. చే గువేరా వైద్యుడు, రచయిత, సిద్ధాంతకర్త, మార్కిస్టు - ఒక్కటేమిటి ఆయన అన్ని కూడా. చే గువేరా 1928 జూన్ 14వ తేదీన జన్మించి 1967 అక్టోబర్ 9వ మరణించాడు. ఆయన అర్జంటీనా మార్క్సిస్టు. క్యూబా విప్లవానికి వేగు చుక్క. క్యూబా అధ్యక్షుడు క్యాస్ట్రోకు మార్గదర్శకుడు. సరే, ఇంతకీ పోసాని కృష్ణమురళికి చే గువేరా దుశ్శాసనుడిగా కనిపించడంలో అర్థం ఉందనుకోవచ్చు. దాన్ని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఉంటుంది.

చే గువేరా అందరి ప్రాపర్టీ అని పోసాని కృష్ణమురళి వాదిస్తున్నారు. అవసరమైతే చే గువేరాలా కనిపించకుండా శ్రీకాంత్ వేషానికి టోపీ తీసేస్తానని చెబుతున్నారు. తనకు ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం లేదని నమ్మబలుకుతున్నాడు. కానీ, తన తాహతుకు తగని విషయాల జోలికి వెళ్లి పోసాని కృష్ణమురళికి వివాదానికి దిగి ప్రచారం తెచ్చుకోవాలనే లక్షణం మొదటి నుంచీ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X