వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేషం మార్చి తిరుగుతున్న రంజిత!

By Santaram
|
Google Oneindia TeluguNews

Ranjitha
నిత్యానంద స్వామితో రాసలీలలు సాగించిన రంజితను అరెస్టు చేయడానికి అమాయకులైన కర్ణాటక పోలీసులు ప్రయత్నిస్తుండగా, వారిని పక్కదోవపట్టించడానికి తమిళనాడు పోలీసులు యుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది. రంజిత వేషభాషలు పూర్తిగా మార్చి తిరుగుతున్న విషయం తమిళనాడు పోలీసులకు తెలిసినా వారు కర్ణాటక పోలీసులకు ఏ మాత్రం సహకరించడం లేదట. తమిళనాడు టాప్ పోలీసు ఆఫీసర్లతో రంజితకు ఉన్న "ఆ" సత సంబంధాల కారణంగానే ఆమె రక్షణ లభిస్తోందని తెలుస్తోంది. కావేరి జలాలకు సంబంధించి ఉభయ రాష్ట్రాల మధ్య విభేదాల కారణంగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యనే కాదు పోలీసుల మధ్య కూడా వ్యతిరేక భావనలు ఉండడం రంజితకు కలిసివచ్చింది.

ఇలా ఉండగా తన భార్య శీలం విషయం రచ్చకెక్కినా రంజిత భర్త (వీరి మధ్య ఇంకా లీగల్ గా విడాకులు కాలేదట) ఆమెను పెద్ద మనసుతో ఆదరిస్తున్నట్టు సమాచారం. రంజిత విదేశాలకు వెళ్ళిపోయిందన్న వదంతులున్నాయి. కానీ ఆమె మరోసారి ఉత్తరాది పర్యటనలో ఉన్నట్టు ఒక వర్గం కథనం. ఆమె కర్ణాటక పోలీసులకు చిక్కితే ఎలాగైనా ఆమె నుంచి బిదడి ఆశ్రమం రహస్యాలను, నిత్యానంద సెక్స్ రాకెట్లను రాబడతారు. స్వామికి సహకరించేందుకే ఆమె దేశాటనానినికి బయలుదేరినట్టు చెబుతున్నారు. అది స్వామి మీద ఉన్న ప్రేమా? కామమా? ఆయన ఇచ్చిన డబ్బు ప్రభావమా అన్నది తెలియవలసి ఉంది. జైలు నుంచి విడుదలై ఆశ్రమానికి వచ్చిన స్వామి మాత్రం ఎప్పటిలాగానే భక్తులను ట్రాన్స్ లోకి పంపించి ప్రేమ భావనలో తప్పులేదని నూరి పోస్తూ తన తప్పును కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X