• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రంజిత వాంగ్మూలమే కీలకం

By Santaram
|

Ranjitha
హైదరాబాద్: నిత్యానంద స్వామి అరెస్టు తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన నిన్న హిమాచల్ ప్రదేశ్ లో అరెస్టైన విషయం తెలిసిందే. నిత్యానందకు సంబంధించి మోసం వంటి కేసులను పెట్టినా ప్రధానంగా రంజితతో కామకలాపాలే ముఖ్యమైన కేసు కానుంది. రంజిత అంగీకారంతో ఆయన అలా చేసి ఉంటే ఆ కేసు కూడా గట్టిగా నిలబడదు.

బెంగళూరు పోలీసులు హిమాచల్ కు చేరుకుని నిత్యానందని అరెస్టు చేసిన వెంటనే స్వామి తన నేరాలను ఒప్పుకున్నట్టు విన్పిస్తోంది. అయితే ఆయన రేపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత తన మాటను మార్చుకునే అవకాశముంది.

నిత్యానంద స్వామి మీద పోలీసులు పెట్టిన మానభంగం కేసు నిలబడే అవకాశం లేదు. కానీ రంజిత గనుక పోలీసులకు సహకరించి స్వామి తనను లైంగికంగా బలవంతంగా లొంగదీసుకున్నాడని ఫిర్యాదు చేస్తే స్వామి పోలీసుల ఉచ్చులో చిక్కుకున్నట్టే. ఇప్పటికే రంజితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ఎలాగైనా ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. రేపు మధ్యాహ్నానికల్లా ఈ కేసు వివరాలు తెలిసే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X