నిత్యానందకు ఈ కుట్ర 3 ఏళ్ళ ముందే తెలుసా?

Published: Friday, April 2, 2010, 15:25 [IST]
 

నిత్యానందకు ఈ కుట్ర 3 ఏళ్ళ ముందే తెలుసా?
 

ఆశ్రమంలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని నిత్యానంద స్వామి మూడేళ్ళ క్రితమే తన దివ్య దృష్టితో తెలుసుకోగలిగారా? ఆరు నెలల నుంచి ఆశ్రమంలో ధ్యాన శిక్షణ పొందుతున్న సంతోష్ అనే భక్తుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. "స్వామీజీ మీద నా భక్తి విశ్వాసాలి ఇంత కూడా తగ్గలేదు. ఈ వివాదం వస్తుందని ఆయన మూడేళ్ళ క్రితమే వేలాది భక్తుల సమక్షంలో వెల్లడించారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. భక్తులు అటువంటి వదంతులను నమ్మ వద్దని ఆనాడే ఆయన హెచ్చరించారు" అని సంతోష్ చెప్పాడు.

నెలరోజుల క్రితం వరకు ఓంకార శబ్దంతో ప్రతిధ్వనించిన బెంగళూరు శివారు బిదాడి ఆశ్రమంలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పోలీసులు, తెల్ల దుస్తుల సీనియర శిష్యులు తప్ప అక్కడ మామూలు భక్తులు కన్పించడం లేదు. ఎవరైనా ఆశ్రమంలోకి వెళ్ళాలనుకుంటే పోలీసుల, సీనియర్ శిష్యుల యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆశ్రమం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కూడా ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు.

ఆశ్రమం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ధ్యాన మందిరం సగంలో నిలిచిపోయింది. వేలాది మంది భక్తులకు ధ్యానంలో బ్యాచ్ ల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ఆశ్రమం నిర్మాణం చేపట్టారు. స్వామీజీ మీద వచ్చిన ఆరోపణల కారణంగా ఆయన కన్పించకుండా పోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని సీనియర్ శిష్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యానంద స్వామి ఇటీవల తన వెబ్ సైట్ వీడియోలో కన్పించి ఆశ్రమ నిర్వహణ బాధ్యతని సీనియర్ "సాధకుల"కు అప్పగించినట్టు చెప్పారు. ఆయన వీడియోలో చూపించిన సాధకులు ఎవరూ అక్కడ కన్పించలేదు.

కొసమెరుపు: ఇలా ఉండగా నిత్యానంద-మరో హీరోయిన్ దేవయాని సెక్స్ వీడియో తమ దగ్గర ఉన్నట్టు కొందరు బ్లాగుల్లో చెప్పుకుంటున్నారు. కానీ అవి నిజమని ఇప్పటివరకు స్పష్టం కాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు, చెన్నై పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు.

మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Subscribe Newsletter
Videos You May Like
My Place My Voice