హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యూస్ చానళ్ళ మధ్య అనారోగ్య పోటీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugu News Channels
హైదరాబాద్: తెలుగులో 13 టీవీ న్యూస్ చానళ్ళు ఉన్నాయి. ప్రకటనల ఆదాయం అన్ని చానళ్ళకు సరిపోదు. అంటే ప్రకటన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఈ చానళ్ళ మీద అవుతోంది. ఈ స్ధితిలో టీవీ ప్రొఫెషనల్స్ కు తాత్కాలిక డిమాండ్ ఏర్పడింది. ఒక చానల్ లో 40 వేలకు పని చేసే ప్రెజెంటర్ కు మరో చానల్ లో 70 వేలు ఇచ్చి తీసుకుంటున్నారు.

సరే, నష్టాలు వస్తున్నా ఈ టీవీ చానల్స్ ఎలా బండి నడిపిస్తున్నాయి? ఈ చానళ్ళ యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఏవైనా స్వీట్ బాక్సులు ఉన్నాయా? చంద్రబాబు, వైఎస్ హయాంలో ఆ బాక్సులు ఉండేవి. శ్రేష్టమైన శ్రేష్టి, వైశ్య ప్రధాన నేత రోశయ్య హయాంలో ఆ స్వీట్ బాక్సులు టీవీ చానళ్ళ యాజమాన్యాలకు అందడం లేదు. మరో నాలుగేళ్ళ వరకు అంటే సాధారణ ఎన్నికలు వచ్చేవరకు ఈ చానళ్ళను నడపడమంటే చిన్న విషయం కాదు.

తెలుగు న్యూస్ చానళ్లకు సంబంధించి ఇప్పటి వరకు టాప్ స్లాట్ లో కొనసాగుతున్నది టీవీ 9. అయినా ఆ చానల్ కు అవుతున్న ఖర్చుకు ఆదాయానికి పొంతన లేకుండా ఉంది. మంచి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ లేని కొరత ఆ చానల్ లో కన్పిస్తోంది. కంటిన్యువస్ గా రేటింగ్స్ లో టాప గా ఉన్నా యాడ్ రెవిన్యూలో వెనుకబడి ఉండడానికి కారణాలు అనేకం కన్పిస్తున్నాయి. నెలకు రెండు లక్షలు జీతమిచ్చి వైఎస్ ప్రెసిడెంట్ క్యాడర్ లో ఒకరిని ఆపాయింట్ చేసి, నెలకు ఇంత టార్గెట్ ఫిక్స్ చేస్తే బాగుండేది.

ఇక మరో 12 న్యూస్ చానళ్ళ గురించి చర్చించుకోవాలంటే మరికొంత సమయం కావాల్సిందే. ఎన్నికల ముందు అయితే ఆదాయం ఉంటుంది కానీ ఇప్పుడు ఆదాయం లేక చాలా చానళ్ళు విలవిల్లాడుతున్నాయి. సెక్స్ కార్యక్రమాలకు కూడా యంగ్ యువతులను ప్రెజెంటర్లుగా ఉపయోగించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. పెళ్ళి కాని యువతులను అంగ ప్రవేశం, భావప్రాప్తి వంటి కాన్సెప్ట్ లకు ప్రేజెంటర్లుగా వాడుకుని, వారి బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X