• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ ఎందుకు 'లీడర్' కావడం లేదు?

By Santaram
|

YS Jagan-Rana
హైదరాబాద్: శేఖర్ కమ్ముల తీసిన "లీడర్" సినిమాను చూశారా? మీకు ఏమి అన్పించింది. టెకీ, ఎన్నారై అయిన కమ్ముల సినిమాలు తీయాలన్నమోజుతో హైదరాబాద్ వచ్చి "ఆనంద్" తో టాలీవుడ్ లో కొత్త గాలులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కమ్ముల తాజా చిత్రం "లీడర్" హార్డ్ కోర్ రాజకీయ సినిమా.

ముఖ్యమంత్రులు వేలాది కోట్ల రూపాయలు కొట్తేస్తారని, అది వాళ్ళకు తెలియకుండానే చుట్టుపక్కల వారి ద్వారా జరిగిపోతుందని ఈ సినిమాలో చూపించారు. జనానికి అది వైయస్ రాజశేఖరరెడ్డేనన్న అభిప్రాయాన్ని శేఖర్ కమ్ముల కలిగించారు. ఆ సిఎం కొడుకు రాణా ఎన్నారై. అవినీతికి ఆస్కారం లేని దేశంలో చదువుకుని వచ్చిన రాణాకు తల్లి అదే విషయం చెబుతుంది. మీ నాన్న కొన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకున్నారని, అది కూడా చుట్టు పక్కల ఉన్న "సలహా దారుల" వల్ల అలా జరిగిందని చెప్పి బాధ పడుతుంది.

తన తండ్రికి వారసుడిగా ముఖ్యమంత్రినై అవినీతి రహిత సమాజాన్ని రాణా నిర్మించాలనుకుంటాడు. యుక్తితో ముఖ్యమంత్రి అవుతాడు. తన తండ్రి అక్రమంగా సంపాదించిన వేలాదికోట్లను ప్రజలకు అంకితం చేస్తాడు. అది ఏ ట్రెజరీ అని అడకండి. అది సినిమా. సందేశాన్ని మాత్రమే తీసుకోవాలి.

మరి వైయస్ మరణించిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్ ఈ సాహసానికి తెగించారా? ఆయన అలా ఎందుకు చేయలేకపోయారు? రాజకీయాల్లో అవినీతి ఉందన్న విషయం ఆయనకు తెలియదా? ఆ కొన్ని వేల కోట్ల రూపాయలను ఈయన ప్రకటించి, అవినీతి రహిత సమాజం కోసం ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? శేఖర్ కమ్ముల కు ఉన్నంద సామాజిక అంకిత భావం జగన్ కు ఎందుకు రాలేదు.

అంతెందుకు, తన తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడని విని గుండెలు ఆగి, ఆత్మహత్యలు చేసుకున్న సామాన్యుల కోసం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ ఏ ఒక్క కుటుంబానికైనా ఒక పది లక్షలు సహాయం చేశారు. ఒట్టి ఓదార్పులు ఎందుకు? "లీడర్" సినిమాను ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నారు?

జగన్ కంటే విదేశీ విద్య లేదు. మరి చంద్రబాబు నాయుడు కుమారుడు, రాణా కంటే పాష్ గా అమెరికాలో చదువుకుని వచ్చిన నారా లోకేష్ నాయుడు "లీడర్" సినిమాను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నట్టు? తన తండ్రి మీద కూడా వేలాది కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా? ఆ డబ్బును జనానికి ఇస్తానని లోకేష్ నాయుడు ప్రకటించి సిఎం అయిపోవచ్చు కదా. ఇవన్నీ ఎన్నో గొప్ప విషయాలు. పెద్ద స్క్రీన్ మీద చూసి ఆనందించడానికి బాగుంటాయి. వాటిని ఆచరించడానికి ఏ వారసుడు జగన్ కానీ, లోకేష్ కానీ, కెసిఆర్ కొడుకు కెటీఆర్ కానీ ఎవరూ ముందుకు రారు. మరి శేఖర్ కమ్ముల ఎవరి కోసం ఇటువంటి సినిమాలు తీస్తున్నట్టు?

ఈ అభిప్రాయం మీకు నచ్చితే మీ మిత్రులు నలుగురితో ఈ విషయాన్ని పంచుకోండి. ఒక భ్రమాలోకం వల్ల ఏమీ జరగదని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను మంచి హృదయం ఉన్నవారితో పంచుకోండి. సమాజాన్ని పూర్తిగా మార్చలేకపోయిన్నా మీ మార్గం మీరు వేసుకుంటూ వెళ్ళండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X