వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాతా తెరిస్తే జగన్ అకౌంట్ నుండి డబ్బులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాకినాడ: రూ.50లతో ఖాతా తెరిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, సత్య సాయి ట్రస్టు అకౌంట్ల నుండి డబ్బులు వచ్చి పడతాయనే తూర్పు గోదావరి జిల్లాలో పుకార్లు వచ్చాయి. కేవలం ఖాతా తెరిస్తే వేల రూపాయలు వస్తాయని భావించిన సామాన్య ప్రజలు జిల్లాలోని స్థానిక పోస్టాఫీసులలో రూ.50తో అకౌంట్లు తెరుస్తున్నారు. అకౌంట్లు తెరవడానికి భారీగా జనాలు పోస్టాఫీసుల వద్దకు చేరుకొని క్యూలైన్లలో నిలుచుంటున్నారు. ఒక్కో చోట పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి.

పుకార్ల కారణంగా ఈ నాలుగు రోజులలోనే సుమారు పదివేల ఖాతాలు తెరిచారట. ఇంకా చాలామంది పెద్ద ఎత్తున పోస్టాఫీసులకు చేరుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఖాతా తెరిస్తే డబ్బులు జమ కావని చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నారు. వైట్ కార్డులు ఉన్న వారికే డబ్బులు జమ అవుతాయని పుకార్లు వచ్చాయట. కాగా ఇందుకు సంబంధించిన కథనం ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైంది.

English summary
The roumers were came out that the amount will be credited from YSRC Party president YS Jaganmohan Reddy's account if they open new account with Rs.50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X