వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్విన్‌కు ఇది పెళ్లి కానుక

By Pratap
|
Google Oneindia TeluguNews

R Ashwin
కొద్ది రోజుల్లో పెళ్లి కొడుకు కాబోతున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్‌కు సంబంధించి మరో అనిల్ కుంబ్లేగా అతను ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి టెస్టు మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచులో తొమ్మిది వికెట్లు తీసి భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అది అశ్విన్‌కు పెళ్లి బహుమతి అంటున్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచును భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచు తొలి ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్ రెండో ఇన్నింగ్సులో ఆరు వికెట్లు కూల్చాడు. ఈ నెల 13వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న అశ్విన్ తన ప్రవేశం ఇంత బాగా జరుగుతుందని ఊహించలేదని అంటున్నాడు. తాను వికెట్లు తీసుకోవాలని అనుకున్నానని, అయితే ఇన్ని వికెట్లు తీసుకుంటానని అనుకోలేదని, ఇది తనకూ తన కాబోయే భార్యకు బహుమతి అవునో కాదో తనకు తెలియదని, పెళ్లికి ముందు ఇంత మంచి ప్రదర్శన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అశ్విన్ అన్నాడు. అవతలి వైపు నుంచి ప్రజ్ఞాన్ ఓఝా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెట్టడం వల్ల తనకు అన్ని వికెట్లు దక్కాయని అశ్విన్ అన్నాడు.

English summary
He could not have asked for a better debut as R Ashwin became only the third cricketer ever to get a Man of the Match in his first Test itself and as he prepares to get married in a few days, the off-spinner wondered if the nine-wicket haul against the West Indies is a wedding gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X