• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్మ బెజవాడకు 'వంగవీటి' చిక్కులు

By Srinivas
|
Bejawada
టైటిల్ మార్చినా రామ్ గోపాల్ వర్మ బెజవాడ చిత్రానికి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. నాగచైతన్య హీరోగా త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి మొదట బెజవాడ రౌడీలు అనే టైటిల్ ఖరారు చేయడం విజయవాడ ప్రజలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బెజవాడ ప్రజల ఆందోళన కారణంగానో లేక వర్మ చెబుతున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజ్ఞప్తి మేరకో కారణమేదైనా బెజవాడ నుండి రౌడీలును తప్పించేశారు. దీంతో ఆ చిత్రానికి కష్టాలు తప్పినట్లే అని భావించారు. అయితే చిత్రం ట్రయలర్స్ విడుదలైన తర్వాత స్థానిక నేత వంగవీటి రంగా అభిమానులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ట్రయలర్స్‌ చూస్తే వంగవీటి రంగాను, వంగవీటి రాధాకృష్ణను తక్కువ చేసి చూపించినట్లు కనిపిస్తోందని వంగవీటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే బెజవాడ చిత్రాన్ని తాము అడ్డుకుంటామని వర్మను హెచ్చరిస్తున్నారు.

తమ అభిమాన నేతలను తక్కువగా చేసి చూపిస్తే చిత్రాన్ని ఎక్కడా ఆడనివ్వబోమని చెబుతున్నారు. విజయవాడ పేరు చెబితే వంగవీటి రంగా పేరు ఎవరికైనా గుర్తుకు వస్తుంది. అలాంటి తమ నేతను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదంటున్నారు. ప్రముఖ తమిళ నటుడు ప్రభు ఈ చిత్రంలో రంగాగా కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును కించపర్చేలా రక్తచరిత్ర-1లో, మరో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కించపర్చేలా రక్తచరిత్ర-2లో సన్నివేశాలు ఉన్నాయని టిడిపి, వైయస్ అభిమానులు ఆందోళన చేశారు. తాజా బెజవాడ చిత్రం వంగవీటి అభిమానులకు మనస్థాపం కలిగించేలా ఉందంటున్నారు.

English summary
Ram Gopal Varma's Bejawada film in crisis with Vangaveeti Ranga followers. They suspects Varma created Vangaveeti role as negative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X