జగన్ యాత్రలో క్యాబరే డ్యాన్స్‌లు?
తనతో రప్పించుకోవడానికి కేవలం అశ్లీల నృత్యాలే కాకుండా జనాలకు అద్దెకు తీసుకు వచ్చినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కరోజుకు ఆడవారికి వందరూపాయలు, మగవారికి నూటా యాభై రూపాయలు ఇస్తామని చెప్పినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. కాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసీరెడ్డి జగన్ హరితయాత్రలో అశ్లీల నృత్యాలపై ధ్వజమెత్తారు. హరితయాత్ర పేరుతో క్యాబరే డాన్సులు వేయించడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. పోలవరం కోసమంటూ అశ్లీల నృత్యాలతో రప్పించుకోవాలని అనుకోవడం విడ్డూరమని అన్నారు. పోలవరం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జగన్ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
క్యాబరే నృత్యాల విషయం వైయస్ జగన్‌కు తెలుసా, లేదా అనేది చెప్పలేం. వాటిని ఏర్పాటు చేసింది ఎవరనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. కానీ, జగన్ హరిత యాత్రను రంగుల శృంగార యాత్రగా మార్చిన వైనం మాత్రం నిజమేనని స్థానికులు అంటున్నారు.