వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు సిఎం యోగం లేదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ఆశపడుతున్న మెగాస్టార్ చిరంజీవికి నిరాశే ఎదురువుతుందని ఇప్పుడు వినిపిస్తున్న మాట. నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా జీవించాలని ప్రజలు కోరుకుంటున్నారని తన అంతరంగాన్ని విప్పిన చిరంజీవికి ఆ యోగం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో ఆయనకు రాజయోగం లేదని వారంటున్నారు. కొంత మంది జ్యోతిష్కుల అభిప్రాయాలను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. వారి అభిప్రాయం ప్రకారం - చిరంజీవి ముఖ్యమంత్రి కాలేరు.

చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. ఈ జన్మతేదీ ప్రకారం ఆయనది చిత్త నక్షత్రం, కన్యారాశి. శని మహర్దశ చివరి అంకంలో ఉందని, సెప్టెంబర్‌లో ఆయనకు మరిన్ని సమస్యలు ఎదురు కావచ్చునని వారంటున్నారు. ఏమైనా, చిరంజీవికి సినిమాల్లో రాజయోగం ఉంది గానీ రాజకీయాల్లో లేదని, అందువల్ల ఆయనకు సిఎం పదవి అందుబాటులోకి రాదని వారు ఏకాభిప్రాయంగా చెబుతున్నారు.

నిజానికి, కాంగ్రెసు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని స్థితే ఉంటుంది. 2014 ఎన్నికల్లో చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మాటలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కానీ, ఆయనకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటివారి నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పోటీ ఎదురు కావచ్చు. అంతేకాకుండా, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి రావడం కూడా సాధ్యం కాదని అంటున్నారు.

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మాటల ప్రకారం కూడా కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి చాలా కాలమే ఆగాల్సి వచ్చేట్లుంది. రాష్ట్రం నుంచి ఈ మధ్య కాలంలో రాజ్యసభకు ఎన్నికలు లేనందున అది సాధ్యం కాదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవి కోసం కూడా ఆయన ఏడాదికి పైగా ఆగాల్సి వచ్చేట్లుంది. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో కూడా చెప్పలేం. ఏమైనా, చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై నిర్ధారణకు రావడం కష్టమే.

English summary
Astrologers predict that Chiranjeevi may not become chief Minister. According to them he is not having Rajayoga in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X