వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపిని పక్కన పెట్టిన కాంగ్రెసు హైకమాండ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాకుండా కె. రోశయ్య హయాంలో కూడా చక్రం తిప్పిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును కాంగ్రెసు అధిష్టానం పక్కన పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. కెవిపికి ప్రాధాన్యం తగ్గించాలనే ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను బుజ్జగించి వెనక్కి రప్పించడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. అయితే, ఆయన ప్రయత్నాలు తగిన ఫలితాలు ఇవ్వలేదు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై కెవిపి ప్రభావం తీవ్రంగా ఉంటుందని గతంలో కాంగ్రెసు అధిష్టానం భావించింది. అయితే, ఆ ప్రభావం ఏమీ లేదని తేలిపోవడంతో కెవిపిని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కెవిపికి స్థానం దక్కకపోవడమే కెవిపిని దూరం పెట్టాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటునడానికి నిదర్శనమని అంటున్నారు. గతంలో ఓసారి సమన్వయ కమిటీని వేసినప్పుడు కెవిపి రామచందర్ రావుకు పార్టీ అధిష్టానం స్థానం కల్పించింది. ఈసారి వేసిన సమన్వయ కమిటీలో ఆయన లేరు. ఆయన స్థానంలో చిరంజీవి వచ్చినట్లు కనిపిస్తోంది. చిరంజీవికి ప్రాధాన్యం పెంచుతూ కెవిపి ప్రాధాన్యం తగ్గించడమనే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.

కెవిపి రామచందర్ రావు శుక్రవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మొయిలీ హైదరాబాద్ వచ్చారు. మొయిలీ గతంలో కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. ఆయన స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను అధిష్టానం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమించింది. దీంతో మొయిలీ హైదరాబాదు వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై మాట్లాడలేదు. తెలంగాణపై కూడా తాను మాట్లాడేదేమీ లేదని తప్పించుకున్నారు. తనకు ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలోనే కెవిపి రామచందర్ రావు మొయిలీని కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు.

English summary
It is said that Congress high command has decided to ignore Rajyasabha member KVP Ramachandar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X