వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ఏదో పొడిచేస్తారని అనుకుంటే...

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో పొడిచేస్తారని, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దుతారని, అంత సత్తా ఉందని భావించి ముఖ్యమంత్రిని చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారని పార్టీ అధిష్టానం అనుకుంటోందని అంటున్నారు. ఇదే అభిప్రాయం తనను కలిసిన రాష్ట్రానికి చెందిన కొంత మంది కాంగ్రెసు నాయకుల వద్ద రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి దీటైన జవాబిస్తారని, తెలంగాణ ఉద్యమం రగులుకోకుండా చూస్తారని భావిస్తే ఆయన వల్ల అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. సకల జనుల సమ్మెను విరమింపజేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోంది. రోశయ్య వల్ల కావడం లేదని భావించి కాంగ్రెసు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే, రోశయ్య హయాంలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పైగా, పరిస్థితి మరింత విషమించింది. సమస్యలను గాలికి వదిలేసి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడడం లేదని, సమస్యల పరిష్కారానికి నలుగురితో చర్చించి మాట్లాడాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదని అంటున్నారు. పైగా, మంత్రులను కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోందని అంటున్నారు. మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నవంబర్ 1వ తేదీ నుంచి రూపాయికి కిలో సబ్సిడీ బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. కానీ, ఆ పథకాలను మిగతా మంత్రులు గానీ, పార్టీ నాయకులు గానీ పట్టించుకోవడం లేదు. తమతో సంప్రదించినప్పుడు తమకేమీ పట్టిందనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారు.

అయితే, కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం లేదని అంటున్నారు. మరోసారి ముఖ్యమంత్రిని మారిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందనే భావనతో ఉంది. అదే కిరణ్ కుమార్ రెడ్డికి శ్రీరామరక్షగా మారిందని చెబుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు.

English summary
It is said that Congress high command is unhappy with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X