వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులపై 'కార్పొరేట్' తోముడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Corporate College Students
ఐఐటి వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల హవా స్పష్టంగానే కనిపిస్తుంది. ఐఐటి - జెఇఇలో తొలి పది ర్యాంకుల్లో ఏడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే సాధించారు. అందులోనూ శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ కళాశాలలే సత్తా చాటాయి. యేటా ఇదే పరిస్థితి. కార్పొరేట్ కళాశాలలు ప్రవేశ పరీక్షలే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాయి. ఇందుకు గాను వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. విద్యార్థులను పిల్లల కోళ్ల మాదిరిగా భవనాల్లో కమ్మేస్తున్నాయి. రాష్ట్రంలో ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు విద్యార్థులను సిద్ధం చేసి, సీట్లు సాధించడంలో చుక్కా రామయ్యది పేరు. కొన్ని సంప్రదాయబద్దమైన కోచింగ్ సెంటర్లు కూడా ఉండేవి. అవన్నీ ఈ కార్పొరోట్ కాలేజీల తాకిడికి కుప్పకూలాయి.

కార్పొరేట్ కళాశాలలు పక్కా వ్యాపారదృష్టితో ఇంటర్మీడియట్ విద్యను పెంచి పోషిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాదిగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఐఐటి - జెఇఇకి, ఎఐఇఇఇ ప్రవేశ పరీక్షకు, ఎంసెట్‌కు ఈ విద్యాసంస్థలు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయి. పిల్లలు ఈ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారనే ఆశ కొద్ది తల్లిదండ్రులు ఈ విద్యాసంస్థల్లో చేరుస్తున్నారు. అయితే, ఈ విద్యా సంస్థలు కొద్ది మందిని ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. ర్యాంకులు సాధించే తెలివితేటలు ఉన్న విద్యార్థులను తీసుకుని ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. మిగతా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుల సొమ్ములో చాలా భాగం వీరి కోసం ఖర్చు చేస్తున్నాయి.

మామూలు విద్యార్థులకు, సగటు విద్యార్థులకు ఈ విద్యాసంస్థల్లో సరైన బోధన ఉండదు. సరైన అధ్యాపకులను నియమించరు. నెలల తరబడి సబ్జెక్టు లెక్చరర్లు లేకుండానే నడిపిస్తారు. విద్యార్థులు అడిగితే వేధింపులు ప్రారంభమవుతాయనే ఆరోపణలున్నాయి. ఇటు తల్లిదండ్రులకు కూడా విద్యాసంస్థ యాజమాన్యాలకు భయపడి పిల్లలు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో సగటు విద్యార్థుల దారి సగటు విద్యార్థులది అవుతోంది. కొద్ది మంది ర్యాంకుల ద్వారా ఈ విద్యాసంస్థలు వాణిజ్య ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. మిగతా విద్యార్థులు తమ సొంత ప్రతిభ మీద ఆధారపడి వివిధ కోర్సుల్లో సీట్లు సంపాదించుకుంటున్నారు. పక్కా వ్యాపార ధోరణితో కార్పొరేట్ కాలేజీలు నడుస్తున్నాయి. మెజారిటీ విద్యార్థులను గాలికి వదిలేసి పిడికెడు విద్యార్థులపై శక్తిని, సొమ్మును ధారపోస్తున్నాయి.

English summary
Corporate Colleges are running with business attitude. They are concentrating only few students and getting ranks to increase business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X