వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భానుకిరణ్‌తో తేజకు లింకులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Teja
ప్రముఖ దర్శకుడు తేజకు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసులో పరిష్కారం కోసం దర్శకుడు తేజ భానుకిరణ్ వద్దకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా సమాచారం. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావుతో గతంలో తేజకు వివాదం తలెత్తినపుడు భానుకిరణ్ మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. చదలవాడతో వివాదం ముసురు కోవడంతో తేజ భాను వద్దకు వెళ్లి తన సమస్యకు పరిష్కారం చూపించవలసిందిగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు గాను తేజ భానుకు రూ.25 లక్షల రూపాయలు కూడా ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత భానుకిరణ్, తేజ మధ్య సంబంధాలు కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ హీరోగా, ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నువ్వు-నేను చిత్రంతో తేజ దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు.

దర్శకుడు సి.కళ్యాణ్‌కు కూడా భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సిసిఎస్ పోలీసులు గతంలో సి.కళ్యాణ్‌ను ఓ సారి విచారించారు. సి.కళ్యాణ్‌కు భానుకిరణ్‌తో కలిసి ఉమ్మడి ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉమ్మడి ఆస్తులను చూపించి ఓ అగ్ర దర్శకుడిని కూడా కళ్యాణ్ మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తన ఆస్తులను కుదువపెట్టి ఆ అగ్ర దర్శకుడి వద్ద కళ్యాణ్ రూ.7 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసున్న అగ్ర దర్శకుడు అవాక్కయి పోయాడని సమాచారం. సదరు దర్శకుడు తన అప్పు తీర్చమని తన చుట్టూ తిరుగుతున్నప్పటికీ కళ్యాణ్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే శింగనమల రమేష్‌ను చెన్నైలో అరెస్టు చేసిన పోలీసులు ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆయనకు రెండు వారాల రిమాండును కోర్టు విధించింది. శింగనమల పేరుపై కూడా భాను ఆస్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Some were suspecting that director Teja has links with Bhanu Kiran, who mai accused in Maddelacheruvu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X