వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక భానుకిరణ్ చిక్కినట్టేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ త్వరలో పోలీసులకు చిక్కవచ్చా అంటే అవుననే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ పరారీలో ఉన్నారు. ఇటీవల నాలుగు సార్లు భాను దొరికాడంటూ పుకార్లు వచ్చాయి. మరి కొన్ని సార్లు భాను పోలీసులకు లొంగిపోతానంటూ సంకేతాలు పంపాడని, ఫోన్లు చేశారని పుకార్లు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. పోలీసులు సైతం భాను కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశంలో భాను ఎక్కడున్నాడని వార్తలు వస్తే అక్కడకు వెళుతున్నారు. కానీ అంతలోనే భాను తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు భానును వెదికే పనిలో పడటంతో పాటు ఆయన చేసిన ఆర్థిక లావాదేవీల పైనా దృష్టి సారించారు.

దీంతో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న భానుకు డబ్బులు అందకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. భానుకు ఎవరెవరు డబ్బులు పంపిస్తున్నారు? ఎక్కడి నుండి పంపిస్తున్నారు? తదితర అంశాలపైన పోలీసులు దృష్టి సారించడంతో భానును ఆర్థికంగా ఆదుకునే వారు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో భాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మద్దెలచెర్వు సూరికి సంబంధించిన వారు సైతం భాను కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మన్మోహన్, భానుతో పరిచయం ఉన్న సినీ నిర్మాతలు ఒక్కరొక్కరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటు పోలీసులు ఆర్థికంగా తనను దెబ్బతీయడం, అటు మద్దెలచెర్వు సూరికి సంబంధించిన వారు వెతకడంతో పాటు పలువురు పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో అవుతున్న నేపథ్యంలో భాను లొంగిపోక తప్పదని పలువురు భావిస్తున్నారు.

English summary
Some were suspecting that Bhanu Kiran, who is main accused in Maddelachervu Suri will surrender to police soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X