వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ బలం నిరూపించుకున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
అందరి దృష్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యుల సమావేశంపైనే ఉంటూ వచ్చింది. ఈ సమావేశానికి ఎంత మంది హాజరవుతారనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. సమావేశం ముగిసిపోవడంతో ఆ ఉత్కంఠకు తెర పడింది. కాంగ్రెసు వైపు తిరిగి వెళ్లడానికి మెజారిటీ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారంటూ ఇన్నాళ్లూ వార్తలు వస్తున్నాయి. నిజానికి, పరిస్థితి కూడా అదే. కానీ, కాంగ్రెసుపై నమ్మకం లేక కావచ్చు, చాలా మంది శాసనసభ్యులే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. నలుగురు శానససభ్యులు మాత్రమే జగన్ నుంచి జారిపోతున్నారు. డజను మంది దాకా శాసనసభ్యులు వెనక్కి రావడానికి చర్చలు జరుపుతున్నారంటూ కాంగ్రెసు నాయకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు.

కాంగ్రెసు నాయకుల మాటల్లో కూడా కొంత మేరకు నిజం ఉండవచ్చు. తాను కాంగ్రెసు వైపే ఉంటానంటూ ప్రకటన చేసిన శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డి కూడా గురువారం జరిగిన జగన్ వర్గం శాసనసభ్యుల సమావేశానికి హాజరయ్యారు. మరి కొంత మంది కాంగ్రెసు వైపు తిరిగి వెళ్లడానికి మొగ్గు చూపుతూ ఉండవచ్చు. కానీ, జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశం మాత్రం పూర్తిగా విఫలం కాలేదు, ఒక రకంగా విజయవంతమైందనే చెప్పాలి. ఇరవై మంది శాసనసభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

అయితే, సమావేశం వెనక కసరత్తు చాలానే జరిగిందని అంటున్నారు. శాసనసభ్యులను రప్పించడానికి తెర వెనక వ్యూహాలు, బుజ్జగింపులు చాలానే జరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధవు వైవి సుబ్బారెడ్డి శాసనసభ్యులను తమ నుంచి జారిపోకుండా చూడడంలో ప్రధాన పాత్ర పోషించారని అంటున్నారు. సమావేశం రావడానికి ముందు కొంత మంది శాసనసభ్యులు సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు కూడా. ఆయనతో మాట్లాడిన తర్వాతనే వారు సమావేశానికి వచ్చారు. మొత్తం మీద, పట్టుబట్టి సమావేశం ఏర్పాటు చేసి జగన్ తన బలం పూర్తిగా తగ్గలేదని నిరూపించుకున్నారని అంటున్నారు. అయితే, ఇంకా కొంత మందిలో ఊగిసలాట ధోరణి కొనసాగుతోందని అంటున్నారు.

English summary
According to political analysts - YSR Congress president YS Jagan has proved his strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X