వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఇంటి వైభోగం చూసి నివ్వెరబోయిన సిబిఐ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వైభోగం చూసి అధికారులే నివ్వెర పోయారట. గురువారం సిబిఐ అధికారులు లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటి నిర్మాణ విలువను లెక్కించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ ఇంట్లో అత్యాధునిక ఫర్నిచర్, రెండు స్విమ్మింగ్ ఫూల్స్, అరుదైన చేపలను పెంచేందుకు ఫిష్‌పాండ్స్, సువిశాలమైన ఇళ్లు చూసి అధికారులే ఆశ్చర్యపోయారని ఓ పత్రికలో కథనం ప్రచురించారు. ఖరీదైన బార్ ఎస్కలేటర్, హెలీప్యాడ్, రెండు ఇళ్లలో నిరంతర నిఘాకు 150 సీసీ కెమెరాలు ఉన్నట్లు సమాచారం. సువిశాల రాజసౌథంలో భాగంగా జగన్ తన కార్యాలయం కోసం ఒక భవనం, ఇంటి కోసం మరో భవనం, మధ్యలో ప్రార్థన మందిరాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో సుమారు 60 గదులు, ఒక మినీ థియేటర్, లక్షల విలువ చేసే టీవీలు ఉన్నట్లు సమాచారం. ప్రతి గదికి ఏసీ సౌకర్యం ఉందని, జగన్‌కు సంబంధించిన ఒక గదిలో కుర్చీ ఖరీదే 18 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

ఇక, జగన్ ఇల్లు, ఆఫీసులకు సంబంధించి ఎవరెవరు వస్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారనే విషయాలను గమనించడానికి 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, వీటిని మానిటరింగ్ చేయడానికి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారని తెలిసింది. తొలి రోజు సోదాల్లో భాగంగా సీబీఐ అధికారులు ఒక కంట్రోల్ రూంను మాత్రమే గుర్తించారని తెలిసింది. రెండో కంట్రోల్ రూం ఎక్కడుందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్ పార్టీ ఆఫీసుకు నిర్మించిన భవనంలోని మూడు అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్‌ను పార్కింగ్, స్టాఫ్ క్వార్టర్లు, సెక్యూరిటీ కంట్రోల్ కోసం వాడారు. మొదటి అంతస్తులోని గదులను కార్యకర్తల కోసం కేటాయించారు. రెండో అంతస్తులోని 20 గదులు వీవీఐపీల కోసం కాగా, ప్రతి గది నుంచి డైనింగ్ హాల్‌కు వెళ్లడానికి మార్గం ఉందని సమాచారం. మాస్టర్ డైనింగ్ హాల్‌లో 250 మంది భోజనం చేయడానికి ఏర్పాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, మూడో అంతస్తులో జగన్‌కు సంబంధించిన ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, లాన్ ఉన్నాయని, జగన్ తన ఆఫీసులో కూర్చుని లోటస్ పాండ్‌ను చూసేలా అద్దాలు ఏర్పాటు చేశారని సమాచారం.

English summary
It seems, CBI officers stunned after seeing YSR Congress party president YS Jaganmohan Reddy's residence at lotus pond of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X