వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మగౌరవంపై వైయస్ జగన్ స్వారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్ ఆత్మగౌరవ నినాదాన్ని తన రాజకీయాలకు ప్రాణవాయువుగా స్వీకరించనున్నట్లు అర్థమవుతోంది. ఆత్మగౌరవాన్ని చంపుకుని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే తనకు ఉన్నత పదవులు లభించి ఉండేవనే మాటను ఆయన పదే పదే చెబుతున్నారు. కడప ఉప ఎన్నికల్లో కూడా దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. ఉప ఎన్నికలను ఆయన కడప ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీగా కూడా ఆయన అభివర్ణించారు. తన ప్రచారంలో ఈ మాటను ఆయన విస్తృతంగా వాడారు.

దానికి తోడు, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ఆయన ఏ విధమైన అవకాశాన్ని కూడా వదులుకోలేదు. వైయస్సార్ వారసులమని చెప్పుకోవడానికి కాంగ్రెసు నాయకులు చేసిన ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. వైయస్ వారసులైతే వైయస్ పథకాలకు ఎందుకు గండికొడుతున్నారని అడిగారు. వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పథకాలే అని కాంగ్రెసు నాయకులు చెప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పథకాలే అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడంలేదని అడిగారు. ఆ రకంగా వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి పట్టుదలతో వ్యవహరించారు. తమ కుటుంబం పట్ల సోనియా వ్యవహరించిన తీరుకు గుణపాఠం చెప్పారని ఆయన భావిస్తున్నారు.

కాంగ్రెసు అధిష్టానం కిరాతకత్వానికి, ఉద్వేగానికి మధ్య ఎన్నికలు జరిగాయని, తన తండ్రి చనిపోయి రెండేళ్లవుతోందని, సెంటిమెంటు ఇప్పటి దాకా ఉండదని జగన్ అన్నారు. తన కుటుంబాన్ని చీల్చడానికి చేసిన కుట్రను ప్రజలు వ్యతిరేకించారని ఆయన చెప్పారు. విజయమ్మకు సోనియా గాంధీ ఆపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నెల రోజులు తీసుకోవడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారని కూడా ఆయన అంటున్నారు.

మొత్తంగా ఆత్మగౌరవ నినాదమే జగన్ ప్రధాన నినాదంగా మారనుంది. 1983లో ఎన్టీ రామరావు ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తెచ్చి కాంగ్రెసు పునాదులు కదిలించారు. అలాగే, ఇప్పుడు కదిలించాలనేది వైయస్ జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

English summary
Though the grand old Congress party is in a denial mode, the writing on the wall was clear even before the election results were out. The Kadapa atma gouravam' (self-pride) won hands down against Delhi ahamkaram' (arrogance) and Jaganmohan Reddy had made no bones about this factor during his intense campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X