వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదికపై ఆలస్యం అందుకేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు తెలంగాణపై సీరియస్‌గా యోచించినట్టుగా తెలుస్తోంది. సిఎం నిర్ణయంతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో కూడా చర్చించడానికి అధిష్టానం డిఎస్‌ను ఢిల్లీకి పిలిచింది. తెలంగాణ సమస్యపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించే పనిలో కాంగ్రెసు తీవ్రంగా తలమునకలై ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నది. ఒకవైపు ఉద్యోగుల సహాయ నిరాకరణ, మరోవైపు తెలంగాణవాదుల ఆందోళనల మధ్య రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఈ కారణంగా ముఖ్యమంత్రి పరిపాలనపై సరిగా దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల, బంద్‌ల కారణంగా కోట్లాది రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది. దీంతో ఉద్యోగాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం పరిస్థితి దిగజారింది.

ఆందోళనలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం పరిస్థితి అధ్వాన్నంగా తయారవడమే కాకుండా, కాంగ్రెసు పార్టీపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించాలంటే ఆందోళనలు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆందోళనలు తగ్గించాలంటే తెలంగాణపై ఏదో ఒకటి సాధ్యమైనంత తొందరగా తేల్చాలి. ముఖ్యమంత్రి కిరణ్ సైతం అధిష్టానాన్ని తెలంగాణపై తేల్చాలని కోరారు. త్వరలో ఉన్న ఎమ్మెల్సీల జాబితాతో వెళ్లిన ముఖ్యమంత్రి అంతకంటే ముఖ్యంగా తెలంగాణ అంశంపై తేల్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ తాను కట్టుబడి ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో ఆందోళనలు తగ్గించే దృష్టితో సీమాంధ్రులలో గత 2009 మాదిరిగా ఆందోళనలు చెలరేగకుండా నిర్ణయం తీసుకునే దిశలో ఆలోచిస్తుంది.

తెలంగాణలో ఉన్న భావోద్వేగాలను తగ్గించడమే ప్రస్తుత కర్తవ్యంగా అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణలో నెలకొన్న భావోద్వేగాలను తగ్గించి తద్వారా ఆందోళనలు, రాస్తారోకోలు, సహాయ నిరాకరణలకు చెక్ చెప్పాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే తెలంగాణ చల్లబడినా 2009లో మాదిరి సీమాంధ్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి గతంలో లాగా తప్పు చేయకుండా సీమాంధ్రులను నొప్పించకుండా, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను తగ్గించడమే తక్షణ కర్తవ్యంగా ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టుంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఇచ్చాక కూడా ఇంతకాలంగా నిర్ణయం తీసుకోకుండా వెయిట్ చేస్తుంది. నిర్ణయం తీసుకోకుండా వెయిట్ చేయడానికి కారణం - సీమాంధ్రులను రెచ్చగొట్టకుండా, తెలంగాణలో భావోద్వేగాలు తగ్గించడం. ఆ దిశలోనే కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణమే నివేదికపై నిర్ణయానికి ఆలస్యానికి కారణం కావచ్చు.

English summary
It seems, Congress High Command is thinking to down Telanganites regional feelings first. Government and Party is in very trouble with Non Co-Operation, Bandh and agitations. High Command thinking to don't repeat 2009 december.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X