వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబ రాష్ట్ర సమితి: లోకేష్ స్టూడియో ఎన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం అంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ రాష్ట్ర సమితి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ కుమార్ స్టూడియో ఎన్‌ ప్రసారం చేసింది. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో పొలిటికల్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెసు పార్టీలో టిఆర్ఎస్ విలీనం కేవలం ఫ్యామిలీ ప్యాక్ మూలంగానే ఆగిపోయిందని ఆరోపించారు. కెసిఆర్ ఢిల్లీలో భేరం పెట్టారని చెప్పారు. విలీనం కాదంటూ ప్రకనటలు ఇస్తున్నది కేవలం తమ రేటు పెంచుకోవడానికే అని ఆరోపించింది. భేరం కుదిరాక టిఆర్ఎస్ కాంగ్రెసు పార్టీలో విలీనం కాక తప్పదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులైన తనయుడు సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు, కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పదవులపై కూడా భేరం ఆడుతున్నట్గుగా ఆరోపించింది.

కెసిఆర్ మొదటినుండి ఉద్యమాన్ని ఫణంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించింది. తెలంగాణ కోసమంటూ ఎంపీలుగా గెలిచి మంత్రిపదవులు తీసుకున్నారు. ముఖ్యమైన పదవులలో తమ కుటుంబ సభ్యులను కూర్చుండబెట్టారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన శాసనమండలి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ విషయంలో శాసనసభ్యులను మాత్రమే బలి పశువులను చేశారని ఆరోపించింది. పార్టీలో మిగిలిన వారికి తెలియకుండా వారు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారనే విషయాన్ని ప్రశ్నించింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించి వారిని బలి చేశారని ఆరోపించింది. కాగా కెసిఆర్‌కు దగ్గరగా ఉండే మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు క్రాస్ ఓటింగ్ విషయం ముందే తెలుసు ఆనే ఆరోపణలు గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కెసిఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. ఉద్యమం పేరుతో కుటుంబం లాభపడుతూ వ్యాపారాలు చేసుకుంటుందని ఆరోపించింది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెసు పార్టీని విడిచి పెట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటుందని ఆరోపించింది. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ కోసం నిలదీస్తామని చెప్పిన కెసిఆర్ రెండు రోజులు మాత్రం సభలో తెలంగాణపై మాట్లాడి ఇంత వరకు వెళ్లలేదన్నారు. ఇరవై రోజులకు పైగా ఢిల్లీ వెళ్లక పోవడం వెనుక విలీనం ప్రక్రియ జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. కెసిఆర్ కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమైన తర్వాత కాంగ్రెసును ఏమీ అనడానికి సాహసించడం లేదని ఆరోపించింది.

గతంలో కూడా తెలంగాణ ఇచ్చే కాంగ్రెసు ఇవ్వనప్పటికీ వారిని నెత్తికెత్తుకున్నారని ఆరోపించింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒక్కమారు అడిగిన సందర్భం లేదని ఆరోపించింది. ఒక్కసారి బజారు కీడుస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారని, అయితే అధిష్టానం నుండి మందలింపు రావడంతో మళ్లీ ఊరుకున్నారని ఆరోపించింది. టిఆర్ఎస్‌, కెసిఆర్‌ కాంగ్రెసు చేతిలోనే ఉన్నారని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ అవకాశవాదం ప్రజలు తెలుసుకుంటున్నారని, తన ప్రభ తెలంగాణలో తగ్గుతున్నదని గమనించిన కెసిఆర్ విలీనం ప్రస్తావన తెరమీదకు తెచ్చారని ఆరోపించింది.

English summary
TDP president's son Lokesh Kumar's Channel Studio N broadcosted that TRS party is family party. They accused TRS merger with Congress. It broadcosted that KCR is doing political business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X