వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11-11-11: మిరాకిల్ డే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Miracle Day 11-11-11
11-11-11 ఈ రోజు కోసం చాలా మంది ఎప్పటి నుండో నిరీక్షిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ఈ సంఖ్య అదృష్టమైనదని, అద్భుతమైనదని చాలామంది భావిస్తున్నారు. దీంతో ఈ రోజు కోసం చాలా మంది తమ పెళ్లిళ్లను, డెలివరీలను వాయిదా వేసుకున్నారు. ఈ మిరాకిల్ డే సందర్భంగా వేలాది జంటలు ఒక్కటవుతున్నారు. కొంతమంది సిజేరియన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే గురువారం కార్తీక పౌర్ణమి రావడంతో చాలామంది పాశ్చాత్య సంస్కృతి కంటే మన సాంప్రదాయానికే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కొంతమంది పంచాంగం ప్రకారం తమ పెళ్లిళ్లను వేరే రోజు జరుపుకున్నప్పటికీ ప్రీమ్యారేజ్ డే అంటూ జరుపుకుంటున్నారట. అయితే చాలా దేశాల్లో మాత్రం ఈ రోజు పెళ్లిళ్లకు గిరాకీ ఏర్పడింది.

ఈ రోజు(శుక్రవారం) స్నేహితులను, బంధువులను పిలిపించుకొని ఎంగేజ్ మెంట్‌లా చిన్నగా చేసుకుంటారు. అ తర్వాత యథావిథిగా పంచాంగం ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఇది ఢిల్లీలో మరీ ఎక్కువగా ఉందట. మన రాష్ట్రంలో 11-11-11 ప్రభావం అంతగా కనిపించనప్పటికీ కొందరు దాని పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొందరు ఈ రోజు తమ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ రోజు(శుక్రవారం) పదకొండు గంటల పదకొండు నిమిషాలకు అంటే 11-11-11-11-11కు తమ సిజేరియన్లు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇలాంటి నమ్మకాలతో సిజేరియన్లు చేయించుకోవడం, పెళ్లిళ్లను ఆఫుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. డెలివరీ డేట్ ఎప్పుడుంటే అప్పుడే చేయించుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

అయితే చరిత్రలో కూడా 11-11-11కు చాలా ప్రాధాన్యత ఉంది. 11-11-1911న అంటే సరిగ్గా వందేళ్ల క్రితం కింగ్ జార్జ్ ఢిల్లీని రెండోసారి దేశ రాజధానిగా నెలకొల్పిన విషయం గుర్తుకు వస్తుంది. అంతేకాదు కింగ్ అండ్ క్వీన్ మేరీ తమ పవిత్ర ప్రయాణాన్ని కూడా వందేళ్ల క్రితం ఇదే రోజు పోర్ట్స్‌మౌత్ నుండి ప్రారంభించారు. అయితే 11-11-11 మాత్రమే కాకుండా మరో సంవత్సరం మీద నెల రోజులు ఆగితే 12-12-12 వంటి మిరాకిల్ డే కూడా వస్తుంది. కాగా విశాఖ సాగర తీరంలో స్థానికులు 11-11-11 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

English summary
For all those expecting a miracle or just a spot of luck on 11/11/11, here's a nugget from history to bolster their faith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X