చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాయ్ ఫ్రెండ్‌తో నమిత 'రియల్' బిజినెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Namitha
బొద్దుగుమ్మ నమిత త్వరలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించబోతున్నట్టుగా సమాచారం. గత కొంత కాలంగా ఈ బొద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించాలని అనుకుంటోంది అని అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. సినిమాలు తగ్గడమో, చిత్ర పరిశ్రమనుండి బయటకు వెళ్లి పోవడానికో నమిత రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగడం లేదు. ఎందుకంటే రియల్ దందాలోకి ప్రవేశించిన తర్వాత సినిమాలపై ఎప్పటి మాదిరే దృష్టి సారిస్తుందంట. తెలుగు, కన్నడ హీరోయిన్‌గా గుర్తింపు పడిపోయిన నమిత హైదరాబాద్‌, బెంగుళూరులోనో తన రియల్ దందాను ప్రారంభిస్తుందనుకుంటే పొరపాటు.

హిందీ చిత్ర సీమ రాజధాని ముంబయిలో తన రియల్ ఎస్టేట్ ప్రారంభించాలని ఈ ముద్దుగుమ్మ ఉవ్వీళ్లురుతోందంట. నమిత బాయ్ ఫ్రెండ్ ఒకరు ముంబయిలో ఉంటున్నారంట. ప్రస్తుతం నమిత కూడా ముంబయిలోనే ఉంటుందని తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ముంబయిలో రియల్ ఎస్టేట్‌ను ప్రారంభించేందుకు యోచన చేస్తోంది. ముంబయిలో బిజినెస్‌ను ప్రారంభించి అక్కడ క్లిక్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా విస్తరించాలని చూస్తోందంట

మొదట ముంబయిలో, ఆ తర్వాత చెన్నై అక్కడ క్లిక్ అయిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్య పరిధిని క్రమంగా పెంచాలని చూస్తోందంట ఈ అందాల బొమ్మ. అయితే ఇప్పటికే ఆమెకు చిత్రాలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే బిజినెస్‌ను తన బాయ్ ఫ్రెండ్‌కు అప్పగించి ఆ తర్వాత మళ్లీ చిత్రాలపై పూర్తి దృష్టి పెట్టాలని చూస్తుందంట నమిత. ఇప్పటికే హీరోయిన్‌గా ఇమేజ్ క్రమంగా కోల్పోతున్న నమితను రియల్ బిజినెస్ క్లిక్ అయిన తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తానంటే అప్పటికి ప్రేక్షకులు ఆదరిస్తారా చూడాలి.

English summary
Heroine Namitha is plane to real estate business soon. She is planning real estate business along with his boy friend in Mumbai, Chennai and in other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X